రాష్ట్రంలో బలమైన పార్టీ జనసేన పార్టీ.. స్వీడ్ పెంచిన జనసేన పార్టీ సభ్యత్వ నమోదు.. పార్టీకి కార్యకర్తలే దిక్సూచి.. ఎంపీ తంగెళ్ల ఉదయ శ్రీనివాస్..

పయనించే సూర్యుడు మార్చి 8, కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ (బి వి బి) జనసేన పార్టీ సభ్యత్వ నమోదు గత సంవత్సరంతో పోలిస్తే మరింత ఎక్కువ సభ్యత్వ నమోదు చేయాలని అందుకు కార్యకర్తలు ఉద్యమించాలని కాకినాడ ఎంపీ తంగేళ్ల ఉదయ శ్రీనివాస్ పేర్కొన్నారు. జనసేన ఉద్యమ ప్రోగ్రాంలో భాగంగా శనివారం కాకినాడ రూరల్ మండలం తిమ్మాపురం గ్రామం జనసేన గ్రామ గౌరవ అధ్యక్షులు మాదారపు తాతాజీ ఆధ్వర్యంలో జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన కార్యకర్తల సభ్యత్వ నమోదు లో ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే పంతం నానాజీ స్ఫూర్తితో ముందుకు వెళ్తున్న సభ్యత్వ నమోదు త్వరితగతిన పూర్తి చేయాలని గతంలో రూరల్ లో 25 వేల సభ్యత్వం నమోదు చేశామని దాన్ని మరింత రెట్టింపు చేయాలని ఆకాంక్షించారు. జనసేన పార్టీ రాష్ట్రంలో బలంగా ఉందని దాన్ని మరింత బలపరిచేందుకు కార్యకర్తలు ముందుకు రావాలని అన్నారు. కష్టపడిన కార్యకర్తకు తప్పనిసరిగా గుర్తింపు ఉంటుందని తెలియజేశారు. అలాగే జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాలతో ఎమ్మెల్యే పంతం నానాజీ నరసరావుపేట ఎంపీ సెగ్మెంట్లో ఇన్చార్జిగా పనిచేస్తూ సభ్యత్వ నమోదను ముందుకు తీసుకెళ్తున్నారని అలాగే రూరల్ లో కూడా ప్రతి ఒక్కరు త్వరితగతిన సభ్యత్వ నమోద పూర్తి చేయాలని అన్నారు. ముందుగా ఎంపీ కిసాన్లతో జ్ఞాపకాలు అందజేసి ఘనంగా తాతాజీ సత్కరించారు.ఈ సందర్భంగా జనసేన పార్టీ కాకినాడ రూరల్ అధ్యక్షులు కరెడ్ల గోవిందు, దొరబాబు మాట్లాడారు. అనంతరం ఎంపీ ఆధ్వర్యంలో జనసేన పార్టీ సభ్యత్వ నమోదను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ తిమ్మాపురం గ్రామ నాయకులు, జన సైనికులు వీర మహిళలు గ్రామస్తులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *