రైతు వేదికలో సమగ్ర భూ భారతి భూ రీ సర్వే అవగాహన సదస్సు

★ ★ "సభలో మాట్లాడుతున్న భూ సర్వేయర్ ఏడి. అధికారి .ఆర్ .సుదర్శన్" ★ "కామారెడ్డి జిల్లాలో మాచారెడ్డి మండల చుక్కాపూర్ గ్రామం లోఎంపిక" ★ "చుక్కాపూర్ లక్ష్మి నరసంహస్వామి ఆలయంలో విరాళం ఇచ్చారు"

పయనించే సూర్యుడు మార్చి 8 మాచారెడ్డి రిపోర్టర్ హోబిల్ రెడ్డి మాచారెడ్డి మండలం చుక్కాపూర్ గ్రామ రైతు వేదికలో కామారెడ్డి జిల్లా స్థాయి సమగ్ర భూ భారతి భూ రీ సర్వే అవగాహన సదస్సు ఈ రోజు కామారెడ్డి జిల్లాలో చుక్కాపూర్ గ్రామంలో ఎంపిక చేసి ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా భూ సర్వేయర్ ఏడి.అధికారి మాట్లాడుతూ రైతులు భూ సర్వే కార్యక్రమాన్ని తప్పకుండా సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. గతంలో లేని విధంగా ఈసారి పూర్తిస్థాయిలో డిజిటల్ పద్ధతిలో భూ సర్వే నిర్వహించబడుతోందని తెలిపారు. పాత రికార్డుల్లో ఉన్న భూ వివాదాలు, సమస్యలను పరిష్కరించి భూమి వివరాలను పూర్తిగా డిజిటల్ రూపంలో నమోదు చేసి ప్రభుత్వం రైతులకు డిజిటల్ ల్యాండ్ కార్డులను అందించే దిశగా చర్యలు తీసుకుంటోందని చెప్పారు. దీంతో భవిష్యత్తులో భూ రికార్డులపై ఎలాంటి అనుమానాలు లేదా తప్పుడు నమోదు జరగకుండా పారదర్శకమైన వ్యవస్థ ఏర్పడుతుందని, ఈ సర్వే రైతులకు ఒక కొత్త భరోసా కల్పిస్తుందని తెలిపారు. మాచారెడ్డి మండల ఎమ్మార్వో అధికారి మాట్లాడుతూ గతంలో ఉన్న భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ఈ సమగ్ర భూ రీ సర్వే ఎంతో ఉపయోగకరమని అన్నారు. ప్రభుత్వం క్రమబద్ధమైన విధానంలో పూర్తి స్థాయి డిజిటల్ సర్వే నిర్వహించి భూ రికార్డులను డిజిటల్ కార్డుల రూపంలో అందించేందుకు నిర్ణయం తీసుకోవడం సంతోషకరమని పేర్కొన్నారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ భూ వివరాలను సరిచేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపిడిఓ సర్పంచ్ , ఉప సర్పంచ్ మాచారెడ్డి మండలంలోని వివిధ గ్రామాల జిపిఓ లు, ఏ ఈ ఓ.లు మరియు రైతులు పాల్గొన్నారు హోబిల్ రెడ్డి కి 401 , 402 సర్వే నంబర్ ని పట్టా భూమి ని లావణ్య భూమి గా నమో దు అయింది అది రికార్డు లో దిద్ది ఉన్న ది కావున ప్లీజ్ ఈ సర్వే నెంబర్ లో భూమి ని పట్టా భూమి మీద మార్పించ గలరని మనవి జై శ్రీమన్నారాయణ శ్రీ సరాపు హేమలత గారు బోయిన్పల్లి సికింద్రాబాద్ వాస్తవ్యులు దేవాలయం యొక్క అభివృద్ధి పనులు చూసి వారి వంతు సహాయంగా 5116/- రూపాయలను విరాళంగా అందజేయడం జరిగింది వారికి వారి కుటుంబ సభ్యులకు స్వామి వారి ఆశీస్సులు