లట్టుపల్లిలో విజయవంతమైన 99రోజుల ప్రత్యేక వైద్య ఆరోగ్య శిబిరం .

★ 212 మందికి శిబిరం లో ప్రత్యేక ఆరోగ్య పరీక్షలు . ★ లట్టుపల్లి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ టి.ప్రసన్న..

పయనించే సూర్యుడు మార్చి 8 నాగర్ కర్నూలు జిల్లా బిజినపల్లి రిపోర్టర్ కే శ్రావణ్ కుమార్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా శనివారం నాడు బిజినపల్లి మండల పరిధిలోని లట్టుపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వివిధ విభాగాల ప్రత్యేక వైద్య నిపుణులతో ఆరోగ్య శిబిరాన్ని లట్టుపల్లి గ్రామ సర్పంచ్ మారేపల్లి శివలీల ప్రారంభించారు. ఈ సందర్భంగా లట్టుపల్లి వైద్యాధికారి డాక్టర్ టి. ప్రసన్న మాట్లాడుతూ 99 రోజుల ఆరోగ్య మిషన్ కార్యక్రమంలో భాగంగా స్పెషలిస్ట్ వైద్య నిపుణులైన జనరల్ మెడిసిన్,స్త్రీ వైద్యనిపుణులు,శిశు వైద్యులు,దంత వైద్యులు, కంటి మరియుఎముకల వైద్య నిపుణులిచే ఆరోగ్య శిబిరాన్ని నిర్వహించారు. మండలంలోని వివిధ గ్రామాల నుంచి 212 మంది అవసరమైన ప్రత్యేక వైద్యులచే ఆరోగ్య పరీక్షలు చేసుకున్నారు. మాత శిశు మరియు వయోవృద్ధుల సంరక్షణ కొరకుఈ శిబిరాన్ని నిర్వహించారు.ఈ శిబిరంలో 32 మంది గర్భవతులకు స్త్రీ వైద్య నిపుణులు పరీక్షల నిర్వహించారు.గర్భాశయముఖ ద్వారా క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షల కొరకు ఇద్దరు మహిళల నుంచి పాప్ స్మియర్ సేకరించారు.98 మందికి రక్త నమోనాలను సేకరించి నాగర్ కర్నూల్ జిల్లా లోని తెలంగాణ డయాగ్నొస్టిక్ హబ్ కు పంపారు.6గురు కంటిపోర గల వారిని గుర్తించారు.ప్రోగ్రాం అధికారులు డాక్టర్ కృష్ణమోహన్, డాక్టర్ ప్రదీప్ కార్యక్రమాన్ని పరిశీలించారు.ఈ కార్యక్రమంలో నాగర్ కర్నూల్ సాధారణ ఆసుపత్రి స్పెషలిస్ట్ వైద్య నిపుణులు డాక్టర్ సమీన,డాక్టర్ ఉమాదేవి,డాక్టర్ సుష్మ ,డాక్టర్ శంకర్, డాక్టర్ ఖదీర్,ఆరోగ్య పర్యవేక్షకులు శశికళ నాయకులు చంద్ర గౌడ్ సర్పంచ్ శివాలీల,ఆరోగ్య సిబ్బంది నగేశ్,సుమిత్ర, డాక్టర్ మేఘనా రెడ్డి, దివ్య, చంద్రశేఖర్,వరలక్ష్మి, స్వరూప, యుగంధర్, వివిధ ఆరోగ్య ఉప కేంద్రాల మహిళా ఆరోగ్య కార్యకర్తలు,ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.