విజ్ఞాన్ లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలుస్త్రీలంటే చులకన లేని సమాజం రావాలి – విజ్ఞాన్ డైరెక్టర్ శ్రీమతి తన్నీరు సుధారాణి

పయనించే సూర్యుడు రిపోర్టర్ జగయ్యపేట నియోజకవర్గం ఇన్చార్జి చేని రాంబాబు ఎన్టీఆర్ జిల్లా జగయ్యపేట్ట నియోజకవర్గం మార్చి 8 జగయ్యపేట పట్టణంలోని మార్చి 8, అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్బంగా 07.03.2026 శనివారం స్థానిక విజ్ఞాన్ విద్యా సంస్థలలో స్కూల్ డైరెక్టర్ శ్రీమతి తన్నీరు సుధారాణి అధ్యక్షతన ఘనంగా వేడుకలు జరిగాయి. ముందుగా స్కూల్ డైరెక్టర్ శ్రీమతి తన్నీరు సుధారాణి ఇటీవల జరిగిన జిల్లా స్థాయి ఎస్ పిఈఎల్ఎల్ బిఇఇ.పోటీలో పాల్గొన్న 14 మంది విద్యార్థులలో 11 మందికి బహుమతులు రావటంలో ముఖ్య భూమిక పోషించిన మహిళా టీచర్స్ లను శాలువాతో సన్మానించారు. అనంతరం విజ్ఞాన్ స్కూల్ స్టాఫ్ అందరూ కలసి ఒక మహిళ అయినప్పటికీ అవిశ్రాంతంగా శ్రమిస్తూ, నేటి పోటీ ప్రపంచంలో విజ్ఞాన్ రెండు క్యాంపస్ లను గత 25 సంవత్సరములుగా పట్టణంలో ఒక ప్రముఖ విద్యాసంస్థ గా తీర్చిదిద్దుతున్న తమ స్కూల్ డైరెక్టర్ శ్రీమతి తన్నీరు సుధారాణి గారిని సన్మానించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ ఆకాశంలో సగం గా ఉన్న మహిళలకు అవకాశాలు కూడా పురుషులతో సమన స్థాయిలో కలిపించాలని , లింగ వివక్ష లేని సమాజం కావాలని , సమాన పనికి సమాన వేతనం , మహిళలకు చట్ట సభలలో రిజర్వేషన్లు , విద్యావకాశాలు , ఆరోగ్యం మరియు ఉపాధి అవకాశాల ద్వారా మహిళా సాధికారత జరుగుతుందని , నేటికీ ప్రపంచంలో మహిళను చులకనగా , అబలగానే చూస్తున్నారని , అనేక రకాల దాడులు జరుగుతున్నాయని , నిరోధించటానికి పటిష్టమైన చట్టాలు రావాలని, నేడు ఏ రంగంలో చూసిన మగవారితో సమానంగా విమానయాన రంగం , సైన్యం , పోలీసు , వ్యాపారం , రాజకీయం ఇలా ప్రతి రంగం లోనూ మగవారితో సమానంగా పోటీ పడుతున్నారని, ఎంతో అభివృద్ధి సాధించామని చెప్పుకొనే ఈ రోజులలో కూడా మహిళా ఇంకా వివక్షకు గురవుతూనే ఉందని , గతంతో పోలిస్తే ఈ వివక్ష చాలా వరకు తగ్గినప్పటికీ ఇంకా పూర్తిగా సమసిపోవలసిన అవసరం ఉందని ఆయన తెలియజేసారు. అనంతరం మహిళా శక్తిని నిరూపించే, ఒక స్ఫూర్తి దాయకమైన స్కిట్ ను ప్రదర్శించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *