పయనించే సూర్యుడు పెనుగంచిప్రోలు మండలం రిపోర్టర్ ఆరుద్ర రమేష్ బాబు ఎన్టీఆర్ జిల్లా జగయ్యపేట్ట నియోజకవర్గం మార్చి 8 పెనుగంచిప్రోలు గ్రామంలోని ఈ రోజున గ్రామంలో శ్రీ తిరుపతమ్మ అమ్మవారి దేవస్థానం పెనుగంచిప్రోలు ఎన్టీఆర్ జిల్లా ఆంధ్ర ప్రదేశ్ తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ ఎల్బీనగర్ వాస్తవ్యులు చిన్నం యాగయ్య జ్ఞాపకార్థం వారి కుమారుడు చిన్నం నరేష్ , వారి అల్లుడు తెల్ల మేకల శ్రీను కుటుంబ సమేతంగా శ్రీ తిరుపతమ్మ అమ్మవారిని దర్శించుకొని భక్తితో పూజలు నిర్వహించి ఆలయ కార్య నిర్వహణ అధికారి బి మహేశ్వర్ రెడ్డి సూచనల మేరకు శ్రీ తిరుపతమ్మ అమ్మవారికి సుమారు 5 లక్షలు విలువచేసే 33 గ్రాముల బంగారం వస్తువులను విరాళంగా ఆలయ అధికారులకు అందజేశారు వారికి ఆలయ అర్చకులు వేద పండితులచే వేద ఆశీర్వచనం చేసి అమ్మవారి శేష వస్త్రములు తీర్థప్రసాదములు అందజేసినారు ఈ కార్యక్రమంలో విశ్రాంతి ఉద్యోగి నల్లూరి వెంకటేశ్వరావు ఆలయ తనిఖీ దారు పోలంగి లక్ష్మినవీన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు డిప్యూటీ కమిషనర్ మరియు కార్యనిర్వహణ అధికారి బి మహేశ్వర్ రెడ్డి తెలియజేసినారు