పయనించే సూర్యుడు-08-03-2026-రాజంపేట న్యూస్ : జనసేన పార్టీ సభ్యత్వంతో సమాజంలో మార్పుకు నాంది పలకవచ్చునని ఆ పార్టీ రాజంపేట పార్లమెంటు ఇంచార్జి యల్లటూరు శ్రీనివాసరాజు తెలిపారు. శనివారం యల్లటూరు భవన్ నందు యల్లటూరు శ్రీనివాసరాజు ఆధ్వర్యంలో జనసేన పార్టీ “ఉద్యమి” సభ్యత్వ నమోదు సమీక్ష సమావేశము “సాధక్” లతో నిర్వహించారు. ఈ సమావేశంలో యల్లటూరు మాట్లాడుతూ జనసేన పార్టీలో క్షేత్రస్థాయిలో కష్టపడే జనసైనికులకు గుర్తింపు ఇస్తూ వారికి నాయకత్వ బాధ్యతలను అప్పగిస్తూ వారి జీవితానికి భద్రత కల్పించనున్న “ఉద్యమి” సభ్యత్వం సమాజంలో మార్పు తీసుకురావాలనే ఆకాంక్ష ఉన్న ప్రతీ ఒక్కరికి జనసేన పార్టీ తరపున మనస్పూర్తిగా ఆహ్వానం పలుకుతున్నామని తెలిపారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టిన మహా యజ్ఞంలో, జనసేన “ఉద్యమి” సభ్యత్వ నమోదు చేస్తున్న “సాధక్” లను అభినందిస్తున్నానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం మరింత ముందుకు తీసుకుని పోవాలని, ఇంకా అధిక సంఖ్యలో “ఉద్యమి” లను నమోదు చేయించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ “సాధక్” లు పాల్గొన్నారు.