అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న నారాయణఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి

పయనించే సూర్యుడు సంగారెడ్డి జిల్లా కంగిటి మండల్ 9-3-2026 నారాయణఖేడ్ పట్టణంలోని ఏరియా హాస్పిటల్‌లో ఈ రోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా ఆసుపత్రిలో పనిచేస్తున్న మహిళలకు నారాయణఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి నారాయణఖేడ్ సబ్ కలెక్టర్ శ్రీమతి ఉమ హారతి మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు.ఆసుపత్రి సిబ్బందిలోని మహిళలకు ప్రత్యేకంగా సన్మానాలు ప్రదానం చేసి, వారి అమరత్వ సేవలకు ఆ గౌరవం తెలియజేశారు. మహిళల సాధికారత, సేవా దృక్పథాన్ని ప్రశంసిస్తూ, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న మహిళా సంక్షేమ పథకాల గురించి తెలిపారు. ఈ కార్యక్రమంలో వారితోపాటు ఆసుపత్రి సిబ్బందులు,వైద్యులు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు