అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు:

పయనించే సూర్యుడు మేజర్ న్యూస్ మార్చి 09.03.2026 మదనపల్లి అన్నమయ్య జిల్లా పుంగనూరు నియోజకవర్గం ప్రతినిధి జె. నాగరాజ) అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని పుంగనూరు మండల విద్యాశాఖ ఆధ్వర్యంలో ఎస్ టి యు పుంగనూరు రూరల్ మరియు అర్బన్ సహకారంతో మహిళా దినోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించడమైనది. మండల విద్యాశాఖ అధికారి నటరాజ రెడ్డి మాట్లాడుతూ మహిళా విద్యాభివృద్ధి కోసం కృషిచేసి భారతదేశంలోని మొట్టమొదటి మహిపాధ్యాయురాలు అయిన శ్రీమతి సావిత్రిబాయి పూలేని ఆదర్శంగా తీసుకుని పనిచేయాలని మహిళా ఉపాధ్యాయులకు తెలియచేసారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన విశ్రాంత ప్రధానోపాధ్యాయులు సరస్వతి, రాజకుమారి మాట్లాడుతూ మహిళల పైన జరుగుతున్న దాడులను అణచివేయుటకు చట్టాలు ఇంకా కఠిన తరం చేయాలని సమాజంలో ఎదురయ్యే సమస్యలను ప్రతిఘటించే స్థాయికి మహిళలు ఎదగాలని చెప్పారు. ఎస్ టి యు అన్నమయ్య జిల్లా ప్రధాన కార్యదర్శి పోకల మధుసూదన్ మరియు రాష్ట్ర కార్యదర్శి మోహన్ మాట్లాడుతూ నేటి మహిళలు భూమి నుండి ఆకాశం వరకు అన్ని రంగాలలోనూ ముందున్నప్పటికి ఇంకా పూర్తిస్థాయిలో మహిళా సాధికారత సాధించాలని అందుకు అందరూ కృషి చేయాలని తెలియజేశారు. కార్యక్రమంలో సీనియర్ మహిళా ఉపాధ్యాయులను సత్కరించడమైనది. ఆటల పోటీలలో గెలుపొందిన వారికి బహుమతులు ఇవ్వడమైనది ఈ కార్యక్రమంలో ఎంఈఓ రెడ్డన్న శెట్టి,ఎస్ టి యు నాయకులు హరి కిషోర్ రెడ్డి, బుడ్డన్న, మంజునాథ్, వెంకటప్ప, శ్రీరాముల్ రెడ్డి,శ్రీనివాసులు,ప్రసాద్ బాబు, వెంకటరమణ, తులసీ దాస్, దేవకుమార్, శివశంకర్, దీపారాణి, విజయశ్రీ, షబీనా భాను, మాధవి, సురేఖ, షహీనా, హేమలత, అరుణకుమారి,పద్మజ, రేవతి, నాగమంజరి, గాయత్రి, నిర్మల, నాగేశ్వరమ్మ, పార్వతమ్మ, శ్యామలత మరియు అధిక సంఖ్యలో మహిళా ఉపాధ్యాయులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *