ఆరోగ్య లక్ష్మి పథకం పై అవగాహన కార్యక్రమం

పయనించే సూర్యుడు మార్చి 09, (చింతకాని మండలం రిపోర్టర్. వేర్పుల కోటేశ్వరరావు). చింతకాని : చింతకాని మండలం లచ్చగూడెం గ్రామంలోని అంగన్వాడి సెంటర్–2లో ఆరోగ్య లక్ష్మి పథకం పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఐసీడీఎస్ సూపర్వైజర్ విజయలక్ష్మి ఆధ్వర్యంలో గ్రామ సర్పంచ్ కొప్పుల రజిని సమక్షంలో శ్రీమంతం కార్యక్రమం నిర్వహించబడింది.ఈ సందర్భంగా గర్భిణీలు, బాలింతలు మరియు ప్రీ–స్కూల్ పిల్లల తల్లులకు ఐసీడీఎస్ ద్వారా అందించే సేవలపై వివరంగా అవగాహన కల్పించారు. గర్భిణీలు మరియు బాలింతలు తప్పనిసరిగా అంగన్వాడి కేంద్రానికి వచ్చి మధ్యాహ్నం అందించే సంపూర్ణ పోషకాహార భోజనం తీసుకోవాలని సూచించారు.అలాగే 3 నుండి 6 సంవత్సరాల పిల్లలను తప్పనిసరిగా అంగన్వాడి కేంద్రానికి పంపాలని తల్లిదండ్రులకు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో అంగన్వాడి టీచర్ చింతల రమాదేవి, గర్భిణీలు, బాలింతలు మరియు తల్లిదండ్రులు పాల్గొన్నారు.