ఘనంగా శ్రీ సరస్వతి శిశు మందిర్ వార్షికోత్సవం

* విద్యార్థుల సృజనాత్మకతకు వేదికగా పాఠశాలలు: రజిత పరమేశ్వర్ రెడ్డి

పయనించే సూర్యడు / మార్చ్ 09/ ఉప్పల్ ప్రతినిధి సింగం రాజు స్థానిక కొమ్మిడి కృష్ణ రెడ్డి గార్డెన్స్‌లో శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాల వార్షికోత్సవం శనివారం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ఉప్పల్ మాజీ కార్పొరేటర్ రజిత పరమేశ్వర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పాఠశాలలు పిల్లల సృజనాత్మకతను ప్రోత్సహించే వేదికలుగా నిలవాలన్నారు. ప్రతి కార్యక్రమం విద్యార్థుల ప్రతిభను వెలికితీస్తుందని, వారిలో నాణ్యమైన మానవీయ విలువలను పెంపొందిస్తుందని తెలిపారు. విద్యార్థుల అభివృద్ధి కోసం ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం ఎంతో అవసరమని పేర్కొన్నారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన నాట్యాలు, పాటలు, డ్రామాలు అలరించాయి. కార్యక్రమంలో డాక్టర్ ప్రొఫెసర్ భద్రయ్య, హోమియోపతి ప్రిన్సిపాల్ లింగరాజు, సంస్కృతి ఫౌండేషన్ డైరెక్టర్ నాగ ప్రశాంతి, సరస్వతి విద్యాపీఠం ప్రాంత సహ కార్యదర్శి అర్ధచంద్ర ప్రకాష్ రెడ్డి, పాఠశాల ప్రధాన కార్యదర్శి ప్రసాద్, పాఠశాల అధ్యక్షుడు అంకన్నగారి మాధవ్ రెడ్డి, గ్రామ పెద్దలు దుబ్బ నర్సింహ రెడ్డి, గోనె ప్రభాకర్ రెడ్డి, జెట్ట సుధాకర్, సల్ల ప్రభాకర్ రెడ్డి, శంభు ప్రసాద్, జశ్వంత్ రెడ్డి, గుజ్జుల నర్సింహ రెడ్డి, అంజి రెడ్డి, మంజుల, భార్గవి, అనిత, పద్మ, రామ, చంద్రకళ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *