నాగిలిగొండలో ఘోర రోడ్డు ప్రమాదం – వ్యక్తి మృతి

పయనించే సూర్యుడు మార్చి 09, (చింతకాని మండలం రిపోర్టర్.వేర్పుల కోటేశ్వరరావు). ఖమ్మం జిల్లా చింతకాని మండలం నాగిలిగొండ గ్రామంలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. టిప్పర్ లారీ ఢీకొనడంతో మార్కపుడి వెంకటేశ్వర్లు (తండ్రి: గోపయ్య) అనే వ్యక్తి అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. ఈ ప్రమాదం గ్రామంలో విషాదాన్ని నింపింది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.