పయనించే సూర్యుడు,కోరుట్ల మార్చి 9 కోరుట్ల మండలం వెంకటాపూర్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశం ఆదివారం చేపట్టగా ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ వేడుకల్లో పాల్గొన్న కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగ్ రావు .ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత పది సంవత్సరాలుగా నెరవేరని పేద మధ్య తరగతి ప్రజల కల సహకారం చేస్తూ కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వం ముందుకు సాగుతుందని కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇల్లు లేని అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ఇందిరమ్మ ఇంటి నిర్మాణం కోసం ప్రొసీడింగ్ పత్రాలు అందజేయడం జరిగిందని ప్రోసిడింగ్ పత్రాలను తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా ఇంటి నిర్మాణాలు త్వరగా చేపట్టుకోవాలని సూచించారు. ఇంటి నిర్మాణం ఏ విధంగా జరుగుతే ఆ విధంగా ఆ ఇంటి యజమాని ఖాతాలో డబ్బులు జమవుతాయని కావున ప్రొసీడింగ్ పత్రాలు తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా ఇంటి నిర్మాణాలు త్వరగా చేపట్టుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ వివిధ హోదాల నాయకులు కార్యకర్తలు ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ యజమానులు తదితరులు పాల్గొన్నారు.