పయనించే సూర్యుడు న్యూస్ :మార్చి 9, తల్లాడ రిపోర్టర్ తల్లాడ మండలంలోని గొల్లగూడెం గ్రామానికి చెందిన దుండేటి అఖిలేష్ రెడ్డి, భావన సాయి శ్రీ వివాహం శుక్రవారం రాత్రి గ్రామంలో జరిగింది. ఈ కార్యక్రమానికి తల్లాడ మండల కాంగ్రెస్ నాయకులు హాజరై నూతన దంపతులకు అక్షింతలు వేసి దీవించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు దుండేటి వీరారెడ్డి, కేతేపల్లి భాస్కర్ రావు, పగడాల లచ్చిరెడ్డి, మారెళ్ళ మల్లికార్జునరావు, గోవిందు శ్రీనివాసరావు, దీవెల వెంకటేశ్వరరావు, తాళ్ల జోసెఫ్, దుగ్గినేని వెంకటయ్య, తదితరులు ఉన్నారు.