పంచాయతీ స్థలం దారతత్వం..కోట్ల విలువచేసే పంచాయతీ స్థలాన్ని వాటర్ సర్వీసింగ్ సెంటర్ కు దారతత్నం చేశారు వాకలపూడి పంచాయతీ..

పయనించే సూర్యుడు మార్చి 9, కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ (బి వి బి) పంచాయతీ ఆదాయానికి గండి కొట్టడమే కాకుండా ఎటువంటి అనుమతులు లేకుండా తనకు నచ్చినట్టు తనకి ఇష్టం వచ్చినట్లు పంచాయతీకి ఒక్క రూపాయి కూడా చెల్లించకుండా ఇవ్వడం గమనార్హం వివరాలకు వెళ్తే కాకినాడ రూరల్ మండలం వాకలపూడి గ్రామపంచాయతీ పరిధిలో ఏడిపి రోడ్డు ఓఎన్జిసి టెర్మినల్ జంక్షన్ వద్ద గల వాకలపూడి గ్రామ పంచాయతీకి సంబంధించిన సుమారు 1200 గజాల స్థలాన్ని ఓ ప్రైవేటు వ్యక్తి కి దారా దత్తం చేశారు.ఎటువంటి అనుమతులు లేకుండా సర్వీస్ సెంటర్ ని ఏర్పాటు చేసి హాయిగా దాని ద్వారా సొమ్ములు అర్ధిస్తున్నాడు అంతేకాకుండా అక్కడ లారీలు ఇతర వాహనాలను క్లీన్ చేసే కెమికల్ వాటర్ రోడ్డు మీద రావడంతో అనేక రోడ్డు ప్రమాదాలు జరిగి చాలామంది మృత్యువాత పడిన సంఘటనలు ఉన్నాయి. ఇప్పటికే ఏళ్ల తరబడి రోడ్లు నిర్మాణం జాప్యం కావడంతో రోడ్డుపై బురద ఎక్కువగా ప్రభావంతో వాహనదారు ఇబ్బంది పడుతుంటే దానికి తోడు సర్వీసింగ్ సెంటర్ ద్వారా వచ్చే కెమికల్ వేస్ట్ వాటర్ ద్వారా వాహనదారులు జారిపడి ప్రమాదాలు జరుగుతున్నాయి. గతంలో ఎన్నిసార్లు పంచాయతీకి తెలియపరిచిన స్పందన శూన్యం. అయితే ఈ విషయం ఎన్నిసార్లు తెలియపరిచిన పై అధికారులు చూసి చూడనట్లుగా వ్యవహరించడం బాధాకరం. ఇప్పటికైనా జిల్లా పంచాయతీ అధికారి,జిల్లా కలెక్టర్ స్పందించి పంచాయతీకి ఆదాయానికి గండి కొడుతున్న వాటర్ ప్లాంట్ ను తొలగించి సంబంధిత వ్యక్తి పై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుకుంటున్నారు. ఈ గ్రామంలో ఇలాంటి చాలానే ఉన్నాయి ఒక్కొక్కటి మీ ముందుకు త్వరలో త్వర త్వరగా అందిస్తాం..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *