పసుపు–కుంకుమ బండ్లకు కొబ్బరికాయ కొట్టి ప్రారంభించిన జగ్గయ్యపేట శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ (తాతయ్య )

పయనించే సూర్యుడు పెనుగంచిప్రోలు మండలం రిపోర్టర్ ఆరుద్ర రమేష్ ఎన్టీఆర్ జిల్లా జగయ్యపేట్ట నియోజకవర్గం మార్చి 9 పెనుగంచిప్రోలు మండలం అనిగండ్లపాడు గ్రామం నుండి పెనుగంచిప్రోలు దేవస్థానానికి కొల్లా వారి ఇంటి నుండి బయలుదేరిన పసుపు–కుంకుమ బండ్లకు కొబ్బరికాయ కొట్టి ప్రారంభించిన జగ్గయ్యపేట శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ (తాతయ్య) అనంతరం అనిగండ్లపాడు గ్రామ తెదేపా నాయకులు ఏర్పాటు చేసిన ప్రభలను సందర్శించి పార్టీ నాయకులను అభినందించారు. ఈ కార్యక్రమంలో గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు, యువత సభ్యులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.