పెగడపల్లిలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు

పయనించే సూర్యుడు న్యూస్ మార్చి 9 బోధన్ : బోధన్ మండలంలోని పెగడపల్లి గ్రామంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా పెగడపల్లి గ్రామ సర్పంచ్ మద్ది రచన గ్రామ మహిళలతో ఘనంగా కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. గ్రామ సర్పంచ్ మద్ది రచన సుదర్శన్ మాట్లాడుతూ.. మహిళలు అన్ని రంగాలలో రాణించాలని అన్నారు. మహిళలకు సమాన అవకాశాలు కల్పిస్తే వారు రాణించని రంగమంటూ ఉండదని అన్నారు. తల్లిగా, గృహిణిగా మహిళలు అందించే సేవలు అమూల్యమైనవని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మహ్మద్ షబ్బీర్ గ్రామ పెద్దలు పోతిరెడ్డి, సుదర్శన్, మహిళలు తదితరులు పాల్గొన్నారు