బోధన్ పోలీస్ స్టేషన్లో ఘనంగా మహిళా దినోత్సవం

పయనించే సూర్యుడు న్యూస్ మార్చ్ 9 బోధన్ : బోధన్ పట్టణంలోని పోలీస్ స్టేషన్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని మహిళా కానిస్టేబుల్ లకు మహిళా సంఘం అధ్యక్షురాలు పద్మ సింగ్ కు కేక్ కట్ చేసి ఘనంగా సన్మానించారు. మహిళలు సమాజానికి అందిస్తున్న సేవలను గుర్తిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు పట్టణ సీఐ వెంకట్ నారాయణ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ హాబీబ్, కానిస్టేబుల్స్ మహిళలు తదితరులు పాల్గొన్నారు