పయనించే సూర్యుడు న్యూస్ మార్చ్ 9 బోధన్ :బోధన్‌లో హనుమాన్ మందిరంలో భక్తులకు స్టీల్ గ్లాసులు, ఇస్తరాకుల పంపిణీ బోధన్ పట్టణంలోని రాకాసిపేట్ ప్రాంతంలో ఉన్న శ్రీ హనుమాన్ మందిరంలో ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించేందుకు భక్తులు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. రాకాసిపేట్‌లోని భీముని మందిరం వద్ద భక్తులైన ఏషాల సూరి, రాజు, సంతోష్ రెడ్డి, కలిసి శ్రీ హనుమాన్ స్వామి సేవార్థం స్టీల్ గ్లాసులు మరియు ఇస్తరాకులు స్వాములకు పంపించేశారు.ఆలయానికి వచ్చే భక్తులు ప్లాస్టిక్ గ్లాసులు, ప్లేట్లు ఉపయోగించకుండా స్టీల్ పాత్రలను వినియోగించాలని వారు సూచించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఆలయాలలో ప్లాస్టిక్ వినియోగం వల్ల పర్యావరణానికి హాని కలుగుతుందని, అందుకే పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు. భక్తులు కూడా ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నివారించి పర్యావరణాన్ని కాపాడాలని కోరారు. ఈ కార్యక్రమాన్ని ఆలయ భక్తులు మరియు స్థానికులు అభినందించారు.