అంతర్జాతీయ మహిళా దినోత్సవం. కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ

★ అధ్యక్షురాలు శ్రీమతి గుడిసె ఆది కృష్ణమ్మ ఆధ్వర్యంలో జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కేక్ కటింగ్ చేసి ఘనంగా నిర్వహించారు

పయనించే సూర్యుడు మార్చి 10 ఆదోని నియోజకవర్గం క్రైమ్ రిపోర్టర్ కృష్ణ. ఈ కార్యక్రమంలో మహిళల సాధికారత, సమాన హక్కులు మరియు సమాజ అభివృద్ధిలో మహిళల పాత్రపై ప్రత్యేకంగా చర్చించారు. మహిళలు అన్ని రంగాల్లో ముందుకు రావాలని, వారి ప్రతిభకు మరింత అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉందని నాయకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు మహిళా విభాగం సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మహిళల సేవలను గౌరవిస్తూ వారిని సన్మానించారు. మహిళలు సమాజానికి శక్తి, ప్రేరణగా నిలుస్తారని ఈ సందర్భంగా తెలిపారు.