అర్జీ-3 జి యం కు వినతి పత్రం అందజేత

పయనించే సూర్యుడు న్యూస్: పెద్దపల్లి,సెంటెనరీ కాలనీ -10 ఆర్జీ-3 ఏరియాలో కాంట్రాక్ట్ వద్ద పనిచేస్తున్న సెక్యూరిటీ బొజ్జపల్లి శ్రీసాయి అనే ప్రైవేట్ గార్డ్ మార్చ్ 6న రాత్రి షిఫ్టులో సి సి 13 బి బెల్టు వద్ద డ్యూటీ చేస్తున్న క్రమంలో ఉదయం 3 గంటల 30 నిమిషాలకు దొంగలు వచ్చి రోలర్స్ కారులో లోడు చేస్తున్న క్రమంలో అడ్డుకోవడంతో ప్రైవేట్ గార్డ్ పై నుండి దొంగలు కారు తో గుద్ది వెళ్లిపోయారు. దీనివల్ల ఈ యొక్క ప్రైవేటు సెక్యూరిటీ గార్డ్ గాయాల పాలు అయ్యాడు. ఇట్టి విషయంపై ఈరోజు ఆర్జీ 3 జిఎం ఎస్. మధుసూదన్ కి కలిసి సింగరేణి కాలరీస్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఐఎఫ్టియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏ వెంకన్న వినతిపత్రం ఇవ్వడం జరిగింది అని తెలిపారు.గాయాల పాలు అయినటువంటి ఈ ప్రైవేటు గాడ్ కు ఉచిత వైద్యం వేతనముతో కూడిన సెలవు ఇవ్వాలని అదేవిధంగా గాయపరిచిన దొంగలపై కేసు పెట్టాలని జిఎం దృష్టికి తీసుకెళ్లడం జరిగింది అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ జి త్రీ సెక్యూరిటీ అధికారి షబ్బీర్ దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఎం రమేష్. వి కుమారస్వామి. తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *