ఆడబిడ్డ పెళ్లికి ఆర్థిక సహాయం అందజేసిన బొరుసు గడ్డ తండా సర్పంచ్ లలిత రవి నాయక్

* ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేర్చిన సర్పంచ్

పయనించే సూర్యుడు మార్చి 10 నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి రిపోర్టర్ కే శ్రావణ్ కుమార్ బిజినపల్లి మండల కేంద్రంలోని బొరుసు గడ్డ తండా గ్రామపంచాయతీ సర్పంచ్ లలిత రవి నాయక్ రాత్లావత్ పుణ్య కుమార్తె వివాహానికి హాజరై నూతన దంపతులకు ఆశీర్వాదాలు అందించారు. ఈ సందర్భంగా పెళ్లి కానుకగా రూ.5000 నగదు అందజేశారు. వివాహ వేడుకలో పాల్గొన్న సర్పంచ్ లలిత రవి నాయక్ మాట్లాడుతూ మహిళా దినోత్సవం సందర్భంగా సమాజంలో మహిళలకు గౌరవం పెరగాలని, బాల్య వివాహాలు జరగకుండా ప్రతి ఒక్కరూ జాగ్రత్త పడాలని సూచించారు. అమ్మాయిల విద్యాభివృద్ధి మరియు వారి భవిష్యత్తు కోసం బాల్య వివాహాలకు పూర్తిగా చెక్ పెట్టాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్, గ్రామ పెద్దలు, యువకులు మరియు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *