ఆత్మరక్షణకు మార్షల్ ఆర్ట్స్ కరాటే ఎంతో దోహదపడుతుంది.. మున్సిపల్ చైర్మన్ కట్కం రవీందర్

పయనించే సూర్యుడు న్యూస్ రాయికల్ మండల్ మార్చి 10 మామిడిపెల్లి లక్ష్మణ్ ఆత్మరక్షణకు మార్షల్ ఆర్ట్స్, కరాటే ఎంతో దోహదపడుతుందని మున్సిపల్ చైర్మన్ కట్కం రవీందర్ అన్నారు.ది ఇంటర్నేషనల్ హుయాన్ చుంగ్ నింజాస్ మార్షల్ ఆర్ట్స్ డ్రాగన్ స్వార్డ్ కుంగ్ ఫు అకాడమీ తెలంగాణ రాష్ట్రస్థాయిలో జగిత్యాల జిల్లా ధర్మపురిలో జరిగిన 5వ రాష్ట్ర స్థాయి కుంగ్ ఫు,కరాటే ఛాంపియన్ షిప్ -2026 రాయికల్ పట్టణానికి చెందిన ముక్కేర శ్రీచందన,గంగాధరి హన్షీత్, కండ్లపల్లి శశాంక్ చందోలి ప్రణీత, lపెరుమండ్ల విహరిలు బంగారు పతకాలు,వేల్పుల సాత్విక్, యశోద సాహిత్య, పెరుమండ్ల విశ్వశ్రీలు వెండి పతకాలు, ఇంద్రాల చైత్రిక, వేల్పుల ప్రహర్షిత, స్తంభం నిత్యలు విద్యార్థులు బంగారు పథకం ప్రశంస పత్రం సాధించగా విద్యార్థులకు మున్సిపల్ చైర్మన్ చేతుల మీదుగా సోమవారం పంపిణీ చేశారు. అనంతరం విద్యార్థులకు నోట్ బుక్ పుస్తకాలు పెన్నులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ పుర్రె శ్రీధర్, నాయకులు తురగ శ్రీధర్,అడ్వకేట్ మచ్చ శేఖర్,బత్తిని నాగరాజు, కునారపు భూమేష్,వేముల రాము, కరాటే మాస్టర్ కనుక ప్రభాకర్, హెడ్ కానిస్టేబుల్ అర్జున్, విద్యార్థులు ,తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.