ఆర్యవైశ్యులంతా కలిసికట్టుగా ఉండాలి –వాగు రాజేష్

పయనించే సూర్యుని న్యూస్, మార్చి 10 (ఏలేశ్వరం మండల రిపోర్టర్ ఏ శివాజీ): మండలంలో లింగంపర్తి గ్రామంలో ఆదివారం సాయంత్రం వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో ఆర్యవైశ్య యువజన నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఏలేశ్వరం కమ్యూనిటీ హెల్త్ సెంటర్ చైర్మన్,మండల ఆర్యవైశ్య సంఘ అధ్యక్షుడు వాగు రాజేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ముందుగా ఊర నానాజీ కుటుంబ సభ్యులు,మహిళా సోదరీమణులు ఘనంగా మండల అధ్యక్షుడు వాగు రాజేష్ ను,కార్యవర్గ సభ్యులను సన్మానించారు.అనంతరం లింగంపర్తి పురవీధుల గుండా ఊరేగింపుగా తిరిగి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయానికి చేరుకున్నారు. ఆలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో రాజేష్ మాట్లాడుతూ ముందుగా మహిళా సోదరీమణులకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.ఆర్యవైశ్యులంతా కలిసికట్టుగా ఉండాలని, అందరినీ కలుపుకుని మంచి సేవా కార్యక్రమాలు చేయాలన్నారు,సమస్యలు ఏమైనా వస్తే సంఘ సభ్యులు కలిసి సమస్యను పరిష్కరించుకోవాలన్నారు. అలాగే ప్రభుత్వం నుండి ఆర్యవైశ్యులకు వచ్చే పథకాలను అర్హులైన అందరికీ అందేలా ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు.అనంతరం ఆర్యవైశ్య యువజన నూతన కార్యవర్గ అధ్యక్షుడిగా మాటూరి సూర్యారావు,సెక్రెటరీ గా ఊర రాజబాబు,ట్రెజరర్ గా కప్పల నారాయణ లను ఆర్యవైశ్య పెద్దలు ఊర కృష్ణ,అధ్యక్షులు రాజేష్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో శరణ్య శ్రీను,కప్పల కృష్ణ, కప్పల భూషణం,ఊర నానాజీ, గొల్లపూడి త్రిమూర్తులు, పులపర్తి శ్రీను,రాతి కింద సతీష్, ప్రగళ్లపాటి కామేష్,వాగు బాబులు,ఆర్యవైశ్య సంఘ సభ్యులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.