ఆషా స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా 10వ తరగతి విద్యార్థులకు పరీక్ష సామాగ్రిని అందజేసిన కాంగ్రెస్ నాయకులు.

* ఎమ్మెల్యే మాట్ట రాగమయి దయానంద్ సూచన మేరకు. * ఎగ్జామ్స్ ప్యాడ్స్ పెన్నులు పరీక్ష సామాగ్రి అందజేసిన అన్నారుగూడెం గ్రామ కాంగ్రెస్ నాయకులు. * పరీక్షల పట్ల విద్యార్థులు భయాందోళన చెందొద్దు.

పయనించే సూర్యుడు న్యూస్ :మార్చి 10, తల్లాడ రిపోర్టర్ మండల పరిధిలో అన్నారుగూడెం గ్రామ జడ్పీఎస్ఎస్ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు మాజీ గ్రామ సర్పంచ్ మారెళ్ళ మమత, మాజీ ఎంపీటీసీ తుమ్మలపల్లి సత్యవతి,సొసైటీ డైరెక్టర్ గోవిందు శ్రీనివాసరావు, జిల్లా నాయకుడు తుమ్మలపల్లి రమేష్, మాజీ ఎంపీటీసీ తాళ్ల జోసెఫ్, పిన్ని కృష్ణయ్య, గోవింద్ అప్పరావు, వార్డ్ మెంబర్స్ అలవాల దావీదు, గొడ్ల డేవిడ్, ముఖ్యఅతిథిగా పాల్గొని ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్ సూచనల మేరకు 10వ తరగతి విద్యార్థులకు ఫ్యాడ్స్, పెన్నులు, పరీక్ష సామాగ్రిని పంపిణీ చేశారు. కార్యక్రమంలో నాయకులు మాట్లాడుతూ ఆశ స్వచ్ఛంద సేవ సంస్థ ద్వారా నియోజకవర్గంలోని ఉన్నటువంటి ప్రతి పాఠశాలలకు విద్యార్థిని విద్యార్థులకు పాడ్స్, పరీక్ష సామాగ్రినీ అందిస్తున్నటువంటి ఎమ్మెల్యే మాట్ట రాగమయి కి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియపరిచారు. అదేవిధంగా పరీక్షలు రాసే టైంలో భయపడొద్దు భయాందోళన చెందొద్దు ఒత్తిడికి గురి కావద్దు. సమర్థవంతంగా విద్యార్థులు పరీక్షలు రాసి అన్నారు గూడెం గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని వారు కోరారు. అదేవిధంగా ఎంఈఓ దామోదరవరప్రసాద్, మాట్లాడుతూ విద్యార్థులు పరీక్షలు రాసి నూటికి నూరు శాతం మంచి రిజల్ట్ తీసుకొచ్చి గ్రామానికి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకి మంచి పేరు తీసుకురావాలని విద్యార్థులకు సూచనలు వివరించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు విద్యార్థులు. గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *