ఈనెల 11 నుండి గాలికుంటు వ్యాధి నివారణకు ఉచిత టీకాలు

పయనించే సూర్యుడు మార్చి 10 భీమదేవరపల్లి:- ఈనెల 11వ తేదీ నుండి ఏప్రిల్ 10వ తేదీ వరకు హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలోని అన్ని గ్రామాలలో పశువులకు గాలికుంటు వ్యాధి నివారణకు ఉచిత టీకాల పంపిణీ చేయనున్నట్లు భీమదేవరపల్లి మండల పశువైద్యాధికారి డాక్టర్ మాలతి తెలిపారు.. ఈ సందర్భంగా మాట్లాడుతూ భీమదేవరపల్లి మండలలోని అన్ని గ్రామాలలోనీ గేదెలు, ఆవులు, లాగేలు, దూడలు, వంటి నాలుగు నెలలు నిండిన, ప్రతి పశువుకు టీకా వేయించాలని రైతులకు సూచించారు.. ఉచిత టీకాను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు..