ఈ నెల 11న ముల్కనూర్ పిహెచ్ సీ లో మెగా హెల్త్ క్యాంప్

* డాక్టర్ జ్యోత్స్న

పయనించే సూర్యుడు మార్చి 10 భీమదేవరపల్లి:- ప్రభుత్వ ఆదేశాల మేరకు “ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక” కార్యక్రమంలో భాగంగా, జిల్లా కలెక్టర్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి ఆదేశానుసారం మార్చి 11, బుధవారం రోజున ముల్కనూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లోఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించనున్నట్లు మెడికల్ ఆఫీసర్ డాక్టర్ జ్యోత్స్న తెలిపారు. 11-03-2026 బుధవారం ఉదయం 10:00 గంటల నుండి నిర్వహించనున్నట్లు తెలిపారు. హనుమకొండలోని జిఎమ్ హెచ్, ఎమ్ జి ఎమ్ ఆసుపత్రుల నుండి అనుభవజ్ఞులైన నిపుణులు వైద్య సేవలు అందిస్తారని తెలిపారు. జనరల్ మెడిసిన్, కంటి వైద్యం, దంత వైద్యం, ఎముకల వ్యాధులు, స్త్రీల ఆరోగ్య సమస్యలు, పిల్లల వైద్యం వంటి వాటికీ వైద్య సేవలు అందిస్తారని తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ జ్యోత్స్న మాట్లాడుతూ, ముల్కనూర్ పరిసర ప్రాంతాల ప్రజలు, ముఖ్యంగా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. నిపుణులైన వైద్యుల సలహాలతో పాటు అవసరమైన వారికి ఉచితంగా పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని ఆమె పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *