ఉద్యమకారులపై పెట్టిన కేసులు ఎత్తివేయాలి

* ఉద్యమ పోరాటాల వలనే ఎస్సీ వర్గీకరణ సాధించాం * ఎమ్మార్పీఎస్ నేత నక్క సతీష్ మాదిగ

పయనించే సూర్యుడు 10-3-2026 గొల్లపల్లి మండల రిపోర్టర్ (ఆవుల చందు) జగిత్యాల జిల్లా ఎస్సీ వర్గీకరణ పోరాటంలో భాగంగా తమపై నమోదైన కేసు విచారణ నిమిత్తం ఎమ్మార్పీఎస్ నాయకులు న్యాయవాది బిరుదుల లక్ష్మణ్ తో కలిసి జగిత్యాల కోర్టుకు హాజరయ్యారు. ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ పిలుపు మేరకు, గతంలో మల్యాల ఎక్స్ రోడ్ వద్ద నిర్వహించిన రహదారి దిగ్బంధనంపై మల్యాల పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ కేసులో ఎమ్మార్పీఎస్ నాయకులు మీసాల సాయిలు, నక్క సతీష్, సోమవారం కోర్టు విచారణకు వచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు నక్క సతీష్ మాట్లాడుతూ,పోరాటాలతోనే ఎస్సీ వర్గీకరణ సాధ్యమైందని ఎమ్మార్పీఎస్ నాయకులఫై పెట్టిన కేసులు వెంటనే ఎత్తివేయాలని నక్క సతీష్ డిమాండ్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *