ఎండిన వరి పంటను పరిశీలించి మంత్రిఉత్తంకుమార్ రెడ్డితో మాట్లాడిన మాజీ మంత్రి ఎర్రబెల్లి

పయనించే సూర్యుడు మార్చి 10 (జనగాం ప్రతినిధి కమ్మగాని నాగన్న)ఎస్ ఆర్ ఎస్ పి కాలువల్లో నీరు సరిగా రాక, కాలువల పనులు పూర్తి కాక వర్ధన్నపేట, పాలకుర్తి నియోజకవర్గాల్లో రైతుల పరిస్థితి అగమ్య గోచారంగా మారిందని ఎర్రవెల్లి దయాకర్ రావు ఉన్నారు వర్ధన్నపేట, రాయపర్తి, పెద్దవంగర,తొర్రురు, కొడకండ్ల, పాలకుర్తి మండలాల్లో సైతం రైతుల పరిస్థితి సాగు నీరు లేక అల్లాడిపోతున్నారు 2 రోజుల్లో సాగునీరు అందకపోతే చేతికి వచ్చిన పంట సైతం పూర్తిగా దెబ్బతినే పరిస్థితి ఉంది కాబట్టి వెంటనే సాగు నీరు అందివ్వాలని సాగునీరు శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ని కోరిన మాజీ ఎర్రబెల్లి దయాకర్ రావు ఫోన్లో కోరారు జనగామ జిల్లా దేవరుప్పుల మండలం మల్యా తండ, లకావత్ తండాలో నీళ్లు లేక ఎండిపోయిన పంట పొలాలను బిఆర్ఎస్ నాయకులతో కలిసి పరిశీలించిన ఎర్రబెల్లి దయాకర్ రావు ఈ సందర్భంగా దయాకర్ రావు మాట్లాడుతూ పాలకుర్తి నియోజకవర్గం దేవరుప్పుల మండలంలోని ధర్మపురం గ్రామ పంచాయతీ పరిధి మల్యా తండాలో, లకావత్ తండాలో ఎండిన వరి పంటను పరిశీలించి రైతులు రాందాన్, యాకు, సోమ్లా, పూల్య,లతో మాట్లాడి స్టేషన్ ఘనపూర్ రిజర్వాయర్ నుండి వచ్చే 4L కాలువకు నీళ్లు విడుదల చేసి ఎండిపోతున్న పంటలకు నీళ్లు అందించాలని నీటి పారుదల శాఖ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డికి అధికారులకు ఫోన్ చేసి రైతులు భాదలను వారికి తెలియజేసి సాగు నీరు విడుదల చేయవలిసిందిగా కోరారు గత 10 ఏండ్ల కేసీఆర్ పాలనలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో సుభిక్షంగా ఉందని అన్నారు. ముఖ్యంగా తెలంగాణలో రైతాంగం కోసం చెరువులకు నీళ్లు, 24 గంటల విద్యుత్, రైతు బంధు, రైతు భీమా, సకాలంలో ఎరువులు, గిట్టుబాటు అందించి రైతులను రాజు చేశాడు కేసీఆర్ అని గుర్తు చేసుకున్నారు. ఈ రెండేళ్ల కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో రైతులకు చేసేది ఏమీ లేదు. అస్సలు రైతుల గురించి, వారి అవసరాల గురించి పట్టించుకునే నాథుడే లేకుండా పోయింది. రైతులకు యూరియా దొరకక ఫర్టిలైజేర్ షాప్ లా వద్ద రోజుల కొద్ది వేచి ఉండాల్సిన దుస్థితి వచ్చింది అని ఆవేదన వ్యక్తం చేశారు.ఇప్పటికైనా స్టేషన్ ఘనపూర్ రిజర్వాయర్ నుండి కాలువలకు నీళ్లు విడుదల చేసి రైతులకు న్యాయం చేయాలని లేని పక్షంలో నష్టపరిహారం కింద పంట నష్టం ఎకరాకు 30 వేలు చొప్పున ఇవ్వాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో దేవరుప్పుల మండల బిఆర్ఎస్ పార్టీ నాయకులు, స్థానిక రైతులు పాల్గొన్నారు