పయనించే సూర్యుడు మార్చి 10 నాగర్ కర్నూలు జిల్లా బిజినపల్లి రిపోర్టర్ కే శ్రావణ్ కుమార్ కారుకొండ గ్రామంలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ప్రోత్సాహం అందించే కార్యక్రమం నిర్వహించారు. గ్రామ సర్పంచ్ శ్రీమతి ఉమారాణి శేఖర్ రావు ఆధ్వర్యంలో ప్రాథమికోన్నత పాఠశాల కారుకొండలో విద్యార్థులకు ఉచితంగా గుర్తింపు కార్డులు, టైలు, బెల్టులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ ఉమారాణి శేఖర్ రావు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు కూడా ప్రైవేట్ పాఠశాలలకు ఏమాత్రం తగ్గకుండా చదువులో ముందుకు రావాలని తెలిపారు. విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత స్థానాలకు చేరుకోవాలని సూచించారు. అలాగే పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, వంటమాత, శుభ్రత కార్మికులకు కూడా ఉచిత గుర్తింపు కార్డులు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు రామకృష్ణ, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.