కోనసీమ జిల్లాలో భారీ దొంగతనం కేసు ఛేదించిన పోలీసులు

పయ నించే సూర్యుడు మార్చి 10 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ ​ ఆలమూరు-కపిలేశ్వరపురం పరిసరాల్లో వరుస చోరీలకు తెర.. రూ.32.40 లక్షల సొత్తు స్వాధీనం, ముగ్గురి అరెస్ట్! డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో రాత్రి వేళల్లో ఇళ్ల తాళాలు పగులగొట్టి వరుస చోరీలకు పాల్పడుతున్న ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు అమలాపురం ఎస్పీ కార్యాలయం లో ఏర్పాటు చేసిన సమావేశంలో నిందితుల వివరాలను జిల్లా ఎస్పీ రాహుల్ మీనా వెల్లడించారు. ఫిబ్రవరి 14, 2026న ఆలమూరు పోలీస్ స్టేషన్‌లో నమోదైన క్రైమ్ నంబర్ 22/2026 (సెక్షన్లు 331(4), 305 BNS) కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు ముమ్మర గాలింపు చేపట్టారు. ఆలమూరు, కపిలేశ్వరపురం మండలాల్లో వరుసగా జరుగుతున్న దొంగతనాలపై ప్రత్యేక నిఘా ఉంచిన పోలీసులు ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ​అరెస్టయిన నిందితులు: ​కండ్రె రాజు అలియాస్ చిన్న (22) ​సన్నపు వెంకట రమణ అలియాస్ వెంకన్న (20) ​ఉండ్రి ఆనంద్ కుమార్ (22) ​స్వాధీనం చేసుకున్న సొత్తు: నిందితుల వద్ద నుంచి సుమారు 203.650 గ్రాముల బంగారు ఆభరణాలు, 765 గ్రాముల వెండి వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటి మొత్తం విలువ సుమారు రూ. 32,40,000 ఉంటుందని అంచనా. ​పోలీసుల అభినందన: క్లిష్టమైన ఈ కేసును తక్కువ సమయంలో ఛేదించడంలో కీలక పాత్ర పోషించిన డీఎస్పీ మురళీమోహన్, సీఐ విద్యాసాగర్, సీసీఎస్ సీఐ గజేంద్ర, సిబ్బందిని జిల్లా ఎస్పీ రాహుల్ మీనా ప్రత్యేకంగా అభినందించారు.