పయనించే సూర్యడు న్యూస్ గజ్వెల్ మార్చ్ 10గజ్వెల్ నియోజకవర్గం ఇంచార్జి ఏం ఎస్ రసూల్ సిద్దిపేట జిల్లా గజ్వెల్ పట్టణంలోని ఇంద్రపార్క్ చౌరస్తా లో ప్రాంద్దునే సుమారు ఐదు గంటల. వ్యవ్యవది లో పొట్ట కూటి కోసం అన్నిరకాల కూలి లు రోడు ఇరుపక్కల నిలిచి ఉంటారు పట్టణంలో అడ్డా కూలీల మధ్య నెలకొన్న విభేదాలు ఆదివారం ఉదయం తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. పట్టణంలోని ఇందిరా పార్క్ చౌరస్తాలో రోజువారీ పనుల కోసం వేచి ఉండే కూలీల మధ్య జరిగిన ఘర్షణ స్థానికంగా కలకలం రేపింది. గజ్వేల్ పట్టణంలోని ఇందిరా పార్క్ చౌరస్తా ప్రధాన కూడలి కావడంతో, ప్రతిరోజూ ఉదయం గజ్వేల్ చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చే కూలీలతో పాటు, వివిధ రాష్ట్రాల (వలస) నుంచి వచ్చిన కూలీలు జార్ఖండ్ బీహార్ యూపీ. మధ్యప్రదేశ్ ఇక్కడ పని కోసం ఎదురుచూస్తుంటారు. అయితే, గత కొంతకాలంగా పనుల కేటాయింపు విషయంలో స్థానిక కూలీలకు, ఇతర రాష్ట్రాల కూలీలకు మధ్య చిన్నపాటి వివాదాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఆదివారం ఉదయం ఇరు వర్గాల మధ్య మాటల యుద్ధం మొదలై, అది కాస్తా ఘర్షణకు దారితీసింది. గజ్వేల్ చుట్టుపక్కల గ్రామాలకు చెందిన కూలీలు ఆగ్రహంతో ఇతర రాష్ట్రాల కూలీలను కర్రలతో తరిమికొట్టారు. ఈ హఠాత్ పరిణామంతో చౌరస్తాలో భయాందోళనలు నెలకొన్నాయి. ఈ గొడవలు ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో మరింత తీవ్ర రూపం దాల్చే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కావున, సంబంధిత అధికారులు, పోలీసులు వెంటనే జోక్యం చేసుకొని ఇరు వర్గాలతో చర్చలు జరపాలని వారు కోరుతున్నారు. వలస కూలీలకు, స్థానిక కూలీలకు మధ్య నెలకొన్న సమస్యను పరిష్కరించి, అందరికీ సమానంగా న్యాయం జరిగేలా చూడాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.