పయనించే సూర్యుడు 10.2.2026 రావికమ తం మండలం కళ్యాణ్ లోవ గ్రామంలో వినూత్నంగా నిరసన తెలియజేయడం జరిగింది అజయ్పురం. పి కోట్ని బిల్లి గ్రామాల్లో జరిగాయి వంట గ్యాస్ సిలిండర్‌కు రూ.60లు, వాణిజ్య సిలిండర్‌కు రూ.115లు కేంద్ర ప్రభుత్వం పెంచడాన్ని సిపిఎం పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దాడి, రష్యా నుండి ఆయిల్ కొనుగోలుపై ఆంక్షలు నేపథ్యంలో ఈ ధరల పెంపుదల ప్రజలపై శరాఘాతంగా మారింది. ఈ యుద్ధాన్ని ఖండించి నిలుపుదల చేయించడంలో మోడీ ప్రభుత్వం విఫలమైంది. ఆ భారాన్ని నేడు ప్రజలపై నెట్టడం ఘోరం. ఇప్పటికే నిత్యవసర సరుకుల ధరలు పెరిగి సతమతమవుతున్న సామాన్యులపై వంటగ్యాస్ ధర పెంపు పెద్ద దెబ్బ. అలాగే ఉపాధి కోసం తోపుడు బళ్ళు, ఇతర చిన్న చిన్న వ్యాపారాలతో పొట్ట గడుపుకుంటున్న చిరు వ్యాపారులను వాణిజ్య సిలిండర్ ధర పెంపు తీవ్ర నష్టం కలిగిస్తుంది. అంతేకాక అసంఘటిత కార్మికులు స్వల్ప ఆదాయాలు కలిగిన వారు కొనుక్కునే టిఫిన్, కర్రీ తదితర ఆహార ధరలు కూడా పెరుగుతాయి. అన్ని విధాల ప్రజా జీవితాన్ని ఘోరంగా నష్టపరిచే గ్యాస్ ధర పెంపును కేంద్ర ప్రభుత్వం పసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వ మనుగడకు ఆక్సిజన్ సమాకురుస్తున్న టిడిపి కూడా ఒత్తిడి చేయాలని కోరుతున్నాం. గ్యాస్ భారాన్ని ఉపసంహారించాలని సీపీఎం పార్టీకోరుతున్నది. ఈ కార్యక్రమానికిగేమ్మిల వాసు. పాంగి చంద్రయ్య. సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు కే గోవిందరావు తదితరులు పాల్గొన్నారు