గ్రామ సర్పంచ్ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య పనులు

పయనించే సూర్యుడు న్యూస్ 10-03-2026 మంత్రాలయం ఇంచార్జ్ రిపోర్టర్ పెద్దకడబూరు మండలంలోని దొడ్డిమేకల గ్రామంలో సోమవారం గ్రామ సర్పంచ్ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో విస్తృతంగా పారిశుద్ధ్య పనులు చేపట్టారు. గ్రామంలోని ప్రధాన రహదారులు, వీధుల వెంట ఉన్న డ్రైనేజీలలో పేరుకుపోయిన మురుగు, పూడికను తొలగించే పనులు నిర్వహించారు. పలు ప్రాంతాల్లో చెత్తను తొలగించి గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచేలా చర్యలు తీసుకున్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ చంద్రశేఖర్ మాట్లాడుతూ గ్రామంలో పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టి శుభ్రత కార్యక్రమాలు కొనసాగిస్తున్నామని తెలిపారు. గ్రామాన్ని పరిశుభ్రంగా, ఆరోగ్యకరమైన వాతావరణంతో కూడిన ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని అన్నారు. గ్రామ ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించడమే తమ ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. గ్రామ అభివృద్ధికి ప్రజలు కూడా సహకరించాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఆయన గ్రామస్తులకు సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *