ఘనంగా తూరంగి గ్రామం లో ఏటుకూరి నాగమణి ఆధ్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవం..

పయనించే సూర్యుడు మార్చి 10, కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ (బి వి బి) కాకినాడ రూరల్ నియోజకవర్గం తురంగి గ్రామంలో మహిళ దినోత్సవం సందర్భంగా తెలుగుదేశం పార్టీ మాజీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షురాలు ఏటుకూరి నాగమణి,ఆధ్వర్యంలో మహిళా దినోత్సవం కార్యక్రమం నిర్వహించారు.. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాకినాడ రూరల్ నియోజకవర్గం కో కో ఆర్డినేటర్ కటకంశెట్టి వెంకట ప్రభాకర్ (బాబి ) పాల్గొన్నారు ముందుగా కేక్ కట్ చేశారు అనంతరం గ్రామంలో పారిశుద్ధ కార్మికులు, నాయకులకు కార్యకర్త, మహిళలు సత్కరించి చీరల పంపిణీ చేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ నేటి సమాజంలో మహిళలది ఎంతో కీలకపాత్ర అని, దేశ అభ్యున్నతిలో మహిళలు భాగస్వాములుగా ఉండి ప్రగతి వైపు నడిపిస్తున్నారని అన్నారు.. సీఎం చంద్రబాబు మహిళలకు పెద్దపీట పెద్దపీట వేస్తున్నారు అదేవిధంగా మంత్రి నారా లోకేష్ బాబు మహిళ పక్షపాతి రాష్ట్ర మహిళల అభివృద్ధికి ఎంతో కృషి చేస్తోందని, ప్రతి ఇంటినుంచి ఒక మహిళా పారిశ్రామికవేత్తను తయారుచేయడమే తమ కూటమి ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. అనంతరం ఏటుకూరి నాగమణి మాట్లాడుతూ ముందుగా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అని అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అలాగే మంత్రి లోకేష్ అంగన్వాడి కేంద్రాల్లో ఉన్న చిన్నారుల నుంచి స్కూలుకి వెళ్లే వారందరికీ ఉచిత విద్య ఉచిత సదుపాయాలు కల్పించారని అన్నారు. తల్లికి వందనం తో ఇంటిలో ఎంత మంది విద్యార్థులు ఉన్న వారందరికీ తమ తమ బ్యాంకు అకౌంట్లో డబ్బులు వేసిన ఘనత లోకేష్ దే అన్నారు. కూటమి ప్రభుత్వం మహిళల పక్షపాతని వారి అభివృద్ధికి అన్ని విధాల కృషి చేస్తుందని ఈ సందర్భంగా నాగమణి తెలిపారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర గౌడ్ కార్పొరేషన్ డైరెక్టర్ మట్ట ప్రకాష్ గౌడ్, రాష్ట్ర మాల కార్పొరేషన్ డైరెక్టర్ కొల్లబత్తుల అప్పారావు, తెలుగుదేశం పార్టీ జిల్లా అధికార ప్రతినిధి కౌజు నెహ్రూ, కంచిమర్తి లావణ్య, పొదరపు ఉమా, జనసేన వీర మహిళ ముమ్మిడి పుష్పలత, మందరపు చిట్టిబాబు, రుతల రవి మడ్డు శ్రీను, గంగారత్నం, గుడాల లోవరాజు, కోల హరి, మిరపల అచ్యుతంబా,పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు.