ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు.

★ మాన్వి దేవేంద్రప్ప ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కురువ కార్పొరేషన్ చైర్మన్...

పయనించే సూర్యుడు మార్చి 10 ఆదోని నియోజకవర్గం ప్రతినిధి బాలకృష్ణ. ఆలూరు పట్టణం లోని జూనియర్ కళాశాల ఆడిటోరియం నందు ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు . ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కురువ కార్పొరేషన్ చైర్మన్ మాన్వి దేవేంద్రప్ప &ఆలూరు టీడీపీ ఇంచార్జి శ్రీమతి వైకుంఠం జ్యోతి పాల్గొన్నారు..అనంతరం దేవేంద్రప్ప మాట్లాడుతూ మహిళా దినోత్సవం సంధర్బంగా మహిళా సాధికారత అందించిన ఘనత తెలుగుదేశం పార్టీదని అన్నారు.మహిళా సాధికారతకు తెలుగుదేశం పార్టీ మొదట్నుంచి పెద్దపీట వేస్తోంది. అన్న ఎన్టీఆర్ అదికారంలోకి రాగానే మహిళలకు రాజకీయాల్లో 9% శాతం రిజర్వేషన్లు కల్పించగా చంద్రబాబు స్థానిక సంస్థల ఎన్నికల్లో, ఉద్యోగాలు, కళాశాలల్లో 33% రిజర్వేషన్లు అమలు చేశారు. తల్లికి వందనం’ పథకం ద్వారా కుటుంబంలో ఎంతమంది పిల్లలు చదువుతున్నారో వారందరికీ ఒక్కొక్కరికి సంవత్సరానికి రూ.15,000 చొప్పున అందించడం వల్ల చిన్నారుల బంగారు భవిష్యత్ కు బాటలు పడతాయి. ఇప్పటికే చంద్రబాబు దీపం పథకం కింద 65 లక్షలమందికి ఉచిత గ్యాస్ కలెక్షన్లు ఇచ్చారు* . ఇప్పుడు ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం వల్ల మహిళలకు ఆర్థిక చేయూత అందించినట్లవుతుంది..ఈ ఐదేళ్లలో జగన్ రెడ్డి ఆర్టీసీ చార్జీలు పెంచి ప్రజల నడ్డి విరిచాడు. ఇకపై పేద, మధ్యతరగతికి ఆ పరిస్థితి ఉండకూడదనే ఉద్దేశంతో చంద్రబాబు ఉచిత బస్సు ప్రయాణం పథకం తెచ్చారు. పథకం ద్వారా మహిళలందరికీ ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించారు.. ఈ కార్యక్రమంలో అధికారులు,ఎంపీడీఓ,బీజేపీ కిసాన్ మొర్చ్ ప్రెసిడెంట్ బసవరాజు &టీడీపీ నాయకులు పాల్గొన్నారు.