చందానగర్ పోలీస్ స్టేషన్ లో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు..

పయనించే సూర్యుడు, మార్చి 10 రంగారెడ్డి జిల్లా ప్రతినిధి ఎస్ఎం కుమార్ చందానగర్ పోలీస్ స్టేషన్ లో మహిళా దినోత్సవ వేడుకలు సోమవారం ఘనం గా జరిగాయి. ఎస్ హెచ్ ఓ విజయ్ శంకర ఆధ్వర్యంలో మహిళా సిబ్బంది ని ఘనంగా సన్మానించి కానుకలు అందజేశారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి మహిళా ఉద్యోగినులను అభినం దించి, శుభాకాంక్షలు తెలిపారు.సన్మా నం పొందిన వారిలో ఎస్ఐ సంధ్య గొట్టిపర్తి, మహిళా సిబ్బంది జ్యోతమ్మ, సరస్వతి, నరసమ్మ, స్వప్న, నవనీత, పుష్పలీల, పెంటమ్మ, అరుణ, చైతన్య, జయమ్మ, తులసి, యాదమ్మ ఉన్నారు. కార్యక్రమంలో ఎస్సైలు ఆంజనేయులు, ఖ్వాజా మొయినుద్దిన్ ఇతర సిబ్బంది పాల్గొన్నారు.