చింతూరు పాత హాస్పిటల్ మెయిన్ రోడ్ స్థలం నందు ఐటీడీ ఏ ద్వారా కాంప్లెక్స్ నిర్మాణం చేసి ఆదివాసీ వ్యాపారస్తులకు కేటాయించాలి వినతి

* ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ ను కలిసిన ఆదివాసీ జేఏసీ డివిజన్ చైర్మన్ జల్లి.నరేష్

పయనించే సూర్యుడు రీపోటర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జ్ మర్చి 10 పోలవరం జిల్లా చింతూరు డివిజన్ చింతూరులో నాలుగు మండలాల పర్యటనకు విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్టి కమిషన్ చైర్మన్ సొళ్ల బొజ్జిరెడీ కలిసి ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసులు సొంతంగా పండించిన కూరగాయలు అమ్ముకోవడానికి సరైన వెలుసుబాటులేక వారి పడుతున్న బాధలను వివరించడం జరిగింది. ఆదివాసులంటే దేశానికే మూలవాసులు అని చెప్పుకునే విషయాలు పుస్తకాలలో తప్ప షెడ్యూల్ ప్రాంతాలలో కనబడే పరిస్థితి లేదు. ఐదవ షెడ్యూల్ ప్రాంతం చింతూరు మండలంలో ఆదివాసులకేమో సద్దన్నం, ఈ ప్రాంతంలో వలస వ్యాపారస్తులకేమో పరవన్నంలా ఉన్నాయి. చింతూరు మెయిన్ సెంటర్ లో ఆదివాసులు సొంతంగా పండించిన కూరగాయలు అమ్ముకోవడానికి కనీస పరిస్థితులు లేక రోడ్డు పక్కన వలస వ్యాపారస్తులను బ్రతిమిలాడుకునే పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఈ ప్రాంత ఆదివాసులకు అటువంటి పరిస్థితి లేకుండా చింతూరు మెయిన్ సెంటర్ లో స్థిర వ్యాపార స్థావరాలను ఏర్పాటు కు ఐటీడీ ఏ ద్వారా మెయిన్ రోడ్ పక్కన ఉన్న పాత హాస్పిటల్ ప్రహరీ అనుకునీ ఉన్నవి తొలగించి ఐటీడీ ఏ ద్వారా భావనలు నిర్మాణం చేసి స్థానిక ఆదివాసీలకు చేయించే విధంగా కృషి చేయగలరని రాష్ట్ర ఎస్టి కమిషన్ వారిని కలిసి వినతి పత్రం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆదివాసి జేఏసీ డివిజన్ చైర్మన్ జల్లి.నరేష్ జెఎసి మండల చైర్మన్ పోడియం. రామకృష్ణ తదితరులు పాల్గొనడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *