చిన్నకడబూరులో ప్రమాదకరంగా వేలాడుతున్న విద్యుత్ తీగలు – అధికారుల నిర్లక్ష్యంపై గ్రామస్తుల ఆవేదన

పయనించే సూర్యుడు న్యూస్ 10-03-2026 మంత్రాలయం ఇంచార్జ్ రిపోర్టర్ పెద్దకడబూరు మండలం చిన్నకడబూరు గ్రామంలో పలుచోట్ల విద్యుత్ తీగలు జగ్గి ప్రమాదకరంగా వేలాడుతున్నాయి. ఈ పరిస్థితి కారణంగా గ్రామస్తులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. ముఖ్యంగా కొన్ని వీధుల్లో తీగలు నేలకు దగ్గరగా ఉండటంతో ఎప్పుడు ప్రమాదం జరుగుతుందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. గ్రామస్తులు ఈ సమస్యను పలుమార్లు విద్యుత్ శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ సరైన స్పందన లేకపోవడంతో అసహనం వ్యక్తం చేస్తున్నారు. అసిస్టెంట్ లైన్మెన్ లక్ష్మయ్యకు ఈ విషయం గురించి తెలియజేసినా ఇప్పటివరకు చర్యలు తీసుకోకపోవడంతో గ్రామస్తులు తీవ్రంగా ఆవేదన చెందుతున్నారు. ఈ విషయంపై సీపీఐ మండల కార్యదర్శి వీరేష్ మాట్లాడుతూ, చిన్నకడబూరు గ్రామంలో విద్యుత్ తీగలు జగ్గి ఉండటంతో ఎప్పుడు ప్రమాదం జరుగుతుందోనని ప్రజలు భయంతో జీవిస్తున్నారని తెలిపారు. చిన్నపిల్లలు, పశువులు సంచరించే ప్రాంతాల్లో కూడా తీగలు వేలాడుతూ ఉండటం మరింత ప్రమాదకరంగా మారిందని అన్నారు. అధికారులు వెంటనే స్పందించి గ్రామంలో ఉన్న విద్యుత్ తీగలను సరిచేసి ప్రమాదాలను నివారించాలని ఆయన డిమాండ్ చేశారు. సమస్యను నిర్లక్ష్యం చేస్తే ప్రజలతో కలిసి ఆందోళన చేపడతామని హెచ్చరించారు. గ్రామ ప్రజల ప్రాణ భద్రతను దృష్టిలో ఉంచుకొని విద్యుత్ శాఖ అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *