దశల వారిగా ప్రజల సమస్యలన్ని పరిష్కరిస్తామని

* నగర మేయర్ కొలగాని శ్రీనివాస్

పయనించే సూర్యుడు మార్చి 10 కరీంనగర్ న్యూస్: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా సోమవారం రోజు నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ పలు డివిజన్ లలో పర్యటించి… అభివృద్ధి కార్యక్రమాలు శ్రీకారం చుట్టారు. నగరంలోని 13 వ డివిజన్ మార్కండేయ నగర్ కాలనీలో కార్పోరేటర్ తేల్ల లక్ష్మీ రమేష్ తో కలిసి 5 లక్షల నిధులతో సీసీ రోడ్డు, డ్రైనేజీ అభివృద్ధి పనులకు భూమీ పూజ చేసి పనులు ప్రారంభించారు. డివిజన్ లో పారిశుధ్య పనులు చేపట్టి… స్థానిక ప్రజలు దృష్టికి తెచ్చిన పలు డ్రైనేజీ సమస్యలను తనిఖీ చేసి పరిశీలించారు. 14 వ డివిజన్ చింతకుంట రాజీవ్ స్వగృహా కాలనీలో సుడా చైర్మన్ నరెంధర్ రెడ్డి, కార్పోరేటర్ గడ్డి ప్రదీప్, అధికారులు, సిబ్బంది తో కలిసి పారిశుధ్య పనులు ప్రారంభించి పరిశుభ్రత పనులు నిర్వహించారు. కాలనీలో పలు పారిశుధ్య సమస్యలను తనిఖీ చేసి పరిశీలించారు. అనంతరం 5 లక్షల నిధులతో డ్రైనేజీ నిర్మాణం అభివృద్ధి పనులకు భూమీ పూజ చేసి పనులు ప్రారంభించారు. 15 వ డివిజన్ చింతకుంట ప్రాంతంలోని గణేష్ నగర్ని కాలనీలో కార్పోరేటర్ విప్పల సాయి జ్యోతి తో కలిసి 5 లక్షల నిధులతో డ్రైనేజీ అభివృద్ధి పనులకు భూమీ పూజ చేశారు. 16 వ డివిజన్ మల్కపూర్ లో కార్పోరేటర్ కాంతాల జగన్ రెడ్డితో కలిసి 5 లక్షల నిధులతో డ్రైనేజీ అభివృద్ధి పనులకు భూమీ పూజ చేశారు. 17 వ డివిజన్ పరిదిలోని కొత్తపల్లి ప్రాంతంలో కార్పోరేటర్ వేముల కవిత చంద్రశేఖర్ తో కలిసి 5 లక్షల నిధులతో డ్రైనేజీ నిర్మాణం అభివృద్ధి పనులకు, 18 వ డివిజన్ కొత్తపల్లి లో కార్పోరేటర్ వాసాల రమేష్ తో కలిసి మరో 5 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణం అభివృద్ధి పనులకు భూమీ పూజ చేసి పనులు ప్రారంభించారు. సంబంధిత డివిజన్లలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి… పారిశుధ్య కార్యక్రమాలను చేపట్టారు. డివిజన్లలో కార్మీకులు, యంత్రాల సహాయంతో ఖాళీ స్థలాలు, పరిసరాలను శుభ్రం చేశారు. డ్రైనేజీ ల్లో పేరుకు పోయిన సిల్టు, రోడ్లు, డ్రైనేజీ ల వెంబడి కలుపు మొక్కలను తొలగించారు. డివిజన్ల లో పలు డ్రైనేజీ, రోడ్ల సమస్యలను తనిఖీ చేసి పరిశీలించి… పలు సమస్యల పై ప్రజలు అందించిన వినతి పత్రాలను స్వీకరించారు. డివిజన్ ప్రజలు మేయర్ శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సంధర్బంగా మేయర్ కొలగాని శ్రీనివాస్ మాట్లాడుతూ… నగరపాలక సంస్థ లో విలీనం చెందిన గ్రామాల డివిజన్ల దృష్టికి తెచ్చిన సమస్యలను దశల వారిగా పరిష్కరిస్తామని తెలిపారు. విలీన గ్రామాల డివిజన్ల ను ప్రాధాన్యత గా తీస్కోని అభివృద్ధి పనులు చేపట్టేలా చర్యలు తీస్కుంటామన్నారు. ప్రజల సమస్యలు పరిష్కరించమే లక్ష్యంగా పని చేస్తామని తెలిపారు. నగరపాలక సంస్థ ద్వారా ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో ప్రతి రోజు 5 డివిజన్లు పర్యటించి…పారిశుధ్య కార్యక్రమాలు చేస్తున్నట్లు తెలిపారు. డివిజన పపరిసరాలను, ఖాళీ స్థలాలను, డ్రైనేజీ లను శుభ్రం చేస్తూ… త్రాగు నీటి ఇబ్బందులు తొలగిస్తామని తెలిపారు. వేసవి కాలంలో త్రాగు నీటి సమస్యలు పరిష్కరించమే సమ్మర్ ఆక్షన్ ప్లాన్ రూపొందించామని… ప్రణాళిక ప్రకారం డివిజన్ల లో తాగు నీటి సమస్యలు తీర్చేలా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామని తెలిపారు. అంతే కాకుండా వీది దీపాలు లేని చోట కొత్తగా పోల్స్ ఏర్పాటు చేసి లైట్లు ఏర్పాటు చేస్తామన్నారు. ప్రభుత్వం చేపట్టిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో ప్రజలు భాగ స్వాములు కావాలని మన చుట్ట పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. చుట్ట పరిసరాలు శుభ్రంగా ఉంటేనే… ఆరోగ్యంగా జీవిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పోరేటర్ గాజ రమ శివరాం, ఈఈ సంజీవ్ కుమార్, డీఈలు ఓం ప్రకాష్, శ్రీనివాస్, ఎంహెవో సుమన్, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *