పయనించే సూర్యుడు మార్చి 10 భీమదేవరపల్లి:- రాష్ట్ర రవాణా,బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ నెల నేడు భీమదేవరపల్లి మండలంలో పర్యటించనున్నారు. ‘ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమంలో భాగంగా మండల అభివృద్ధి, భవిష్యత్తు కార్యాచరణపై ఆయన కీలక సమీక్ష నిర్వహించనున్నారు.మధ్యాహ్నం 2:00 గంటలకు భీమదేవరపల్లి మండలం గట్ల నర్సింగాపూర్ రైతు వేదికలో సమీక్ష సమావేశం నిర్వహించనున్నట్లు ఎంపీడీవో వీరేశం తెలిపారు. మండల స్థాయి అధికారులు తమ తమ శాఖలకు సంబంధించిన యాక్షన్ ప్లాన్ నివేదికలతో తప్పనిసరిగా హాజరుకావాలని తెలిపారు. యాక్షన్ ప్లాన్ యొక్క సాఫ్ట్ కాపీని ముందుగానే ఎంపీడీవో కార్యాలయంలో సమర్పించాల్సి ఉంటుందని తెలిపారు. మండలంలోని సర్పంచులు, ఉపసర్పంచులు ఈ సమావేశానికి హాజరై తమ గ్రామాల్లోని ప్రగతి నివేదికలను చర్చించవలసిందిగా కోరడమైనది. పంచాయతీ కార్యదర్శులు తమ పరిధిలోని ఉపసర్పంచులకు ఈ సమాచారాన్ని చేరవేసి, సమావేశం విజయవంతమయ్యేలా చూడాలని కోరారు.ఈ సమీక్షా సమావేశానికి మండల స్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులు సకాలంలో హాజరుకావాలని కోరారు..