పదవ తరగతి విద్యార్థులకు (టీ – ఎస్ ఎ టీ ) ద్వారా దిశానిర్దేశం

* డాక్టర్ యోగితా రాణా ఐఏఎస్

పయనించే సూర్యుడు మార్చి 10 ప్రతినిధి గుమ్మకొండ సుధాకర్ డిండి మండలం నల్లగొండ జిల్లా) డిండి మండలం చెరుకుపల్లి గ్రామంలో జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో పదవ తరగతి విద్యార్థులలో పరీక్షల పట్ల ఉన్న భయాన్ని పోగొట్టి, వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపడానికి విద్యాశాఖ కార్యదర్శి డాక్టర్ యోగితా రాణా (ఐఏఎస్) సోమవారం ప్రత్యేక ప్రేరణాత్మక సెషన్‌ను నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న విద్యార్థులు, ఉపాధ్యాయులు మరియు తల్లిదండ్రులను ఉద్దేశించి మధ్యాహ్నం 2:00 గంటలకు టీ-శాట్ (టి- ఎస్ ఏ టి) ద్వారా ఈ ప్రత్యక్ష ప్రసారం కొనసాగింది. జెడ్పీహెచ్ఎస్ చెరుకుపల్లి పాఠశాలలో ప్రత్యక్ష ప్రసారం: పాఠశాలలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని విద్యార్థులకు ప్రత్యక్షంగా వీక్షించేలా ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా పాఠశాల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు ఇస్లావత్ గోప్యా నాయక్ మాట్లాడుతూ, పరీక్షల సమయంలో విద్యార్థులు ఒత్తిడికి లోనుకాకుండా ప్రణాళికాబద్ధంగా చదువుకోవాలని సూచించారు. ఉన్నతాధికారుల సూచనల ద్వారా విద్యార్థులు పరీక్షలను ఎదుర్కొనే మెళకువలను తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం మరియు పదవ తరగతి చదువుతున్న విద్యార్థులందరూ ఉత్సాహంగా పాల్గొన్నారు. విద్యాశాఖ చేపట్టిన ఈ కార్యక్రమం విద్యార్థుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపిందని ఉపాధ్యాయులు పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *