పదవ తరగతి విద్యార్థులకు మోటివేషనల్ & గైడెన్స్ ప్రోగ్రాం

పయనించే సూర్యుడు న్యూస్ రాయికల్ మండల్ మార్చి 10 మామిడిపెల్లి లక్ష్మణ్ మార్చి 14వ తేదీ నుంచి ప్రారంభం కానున్న పదవతరగతి పబ్లిక్ పరీక్షలు రాయనున్న విద్యార్థులకు టి సాట్ నిపుణ చానల్ ద్వారా రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి శ్రీమతి యోగితా రాణా ఐ ఎ యస్ మోటివేషనల్ గైడెన్స్ ప్రోగ్రాం ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా వివిధ అంశాలపై ఆమె విద్యార్థులకు ప్రేరణ మార్గదర్శకత్వం చేశారు. రాయికల్ పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాలురు లో విద్యార్థులు లైవ్ టెలికాస్ట్ ద్వారా వీక్షించారు. విద్యార్థులు పరీక్షలను నిర్భయంగా స్వేచ్ఛగా రాయాలని సూచించారు. ప్రశ్నాపత్రాన్ని చదివి ప్రశ్నలను అవగాహన చేసుకుని సమాధానాలను సరిగ్గా రాయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సముదాయం ప్రధానోపాధ్యాయులు కాపు శ్రీనివాస్ ఉపాధ్యాయులు పి.రాజశేఖర్, ఎ.పద్మ, చెరుకు మహేశ్వరశర్మ, ఎ.రజిత, యస్ శోభ యండి.రాజమహ్మద్ తదితరులు పాల్గొన్నారు.