పదో తరగతి విద్యార్థులకు పరీక్షలపై అవగాహన కార్యక్రమం

★ టీ సాట్ ద్వారా వివరించిన విద్యార్థులకు రాష్ట్ర విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి డాక్టర్ యోగితా రాణా ఐఏఎస్

పయనించే సూర్యుడు మార్చి 10 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్) రాష్ట్రవ్యాప్తంగా పదవ తరగతి విద్యార్థులకు పరీక్షలపై అవగాహన కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. దానిలో భాగంగా ఫరూక్ నగర్ మండలం బూర్గుల జడ్పీహెచ్ఎస్ విద్యార్థులకు రాష్ట్ర విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి డాక్టర్ యోగితా రాణా ఐఏఎస్ ఆధ్వర్యంలో 10వ తరగతి విద్యార్థులకు పదో తరగతి పరీక్షలకు సంబంధించినటువంటి మార్గదర్శకాలు వివరించడం జరిగింది. పదవ తరగతి పరీక్షల సమయంలో ఏవిధంగా చదవాలి అనే అంశంపై ఈ కార్యక్రమానికి నిర్వహించడం జరిగింది. దీనినిడాక్టర్ యోగితా రాణా టీ సాట్ లైవ్ లో బూర్గుల ఉన్నత పాఠశాల విద్యార్థులకు సూచించడం జరిగింది .ఈ కార్యక్రమంలో స్కూల్లో ఉన్నటువంటి పదో తరగతి విద్యార్థులు పాల్గొనడం జరిగింది. ఉపాధ్యాయులు మరియు ప్రధాన ఉపాధ్యాయుల యొక్క పర్యవేక్షణలో ఈ కార్యక్రమాన్ని స్కూల్లో టీ సాట్ లైవ్ ద్వారా చూపించడం జరిగింది. చాలా మంచిగా విద్యార్థులకు మార్గదర్శనం అని డాక్టర్ యోగితా రాణా మరియు స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ డాక్టర్ నవీన్ నికోలస్ విద్యార్థులకు మంచి సూచనలు ఇవ్వడం జరిగింది.