పల్లె నిజామాబాద్ మట్టి పరిమళాల గడ్డపై జన్మించిన జానపద ముద్దుబిడ్డ వేములవాడ వాసి డాక్టర్ జవ్వాజికి అరుదైన గౌరవంతో ప్రాచీన జానపద కళ వైభవ శిఖరం ప్రముఖుల చేతుల మీదుగా ఘనంగా సన్మానం చేసి అందజేశారు

పయనించే సూర్యుడు మార్చ్ 10 (గణేష్ టౌన్ రిపోర్టర్ వేములవాడ: హైదరాబాద్ హరిహర కళాభవన్ లో సార్ సివి రమణ అకాడమీ సేవా సంస్కృతి కా సంస్థ 38వ సంవత్సర ఉగాది మహోత్సవ సువర్ణ గంటా కంకణ గోల్డ్ మెడల్స్ అవార్డుల సంబరాల ఆధ్వర్యంలో 8 3 2026 ఆదివారం ఉగాది సంబరాల అవార్డులు అందజేయడం జరిగినది అలాగే పల్లె నిజామాబాద్ మట్టి పరిమిలాల గడ్డపై జన్మించిన జానపద ముద్దుబిడ్డ వేములవాడ వాసి అరుదైన గౌరవంతో దక్కిన అవార్డు ప్రాచీన జానపద కళ వైభవ శిఖరం అవార్డు డాక్టర్ జవ్వాజి అంజయ్య గౌడ్ కు ముఖ్య అతిథులు విశ్వ ధర్మ సేవ రత్న బ్రహ్మశ్రీ డాక్టర్ శ్రీకృష్ణ చాముండేశ్వర మహర్షి స్వయంభు సాలగ్రామ శ్వేతార్క గణపతి సహిత చాముండేశ్వరి అనుగ్రహ పీఠాధిపతులు శ్రీ రాందాస్ ఆదావలే సామాజిక న్యాయ సాధికారిక శాఖ సహాయ మంత్రి శ్రీ నరపరాజు రామచంద్రరావు తెలంగాణ బిజెపి అధ్యక్షులు విద్యావేత్త డాక్టర్ కోమటిరెడ్డి గోపాల్ రెడ్డి పర్యవరణ విద్య వైభవ సరస్వతి కార్యక్రమం నిర్వాహకులు మహేంద్రవాడ వెంకటేశ్వరరావు సివి రామన్ అకాడమీ ప్రధాన కార్యదర్శి మరియు తదితరులు పాల్గొని ప్రముఖుల చేతుల మీదుగా తలపై రాజమకుటం చేతుకు సింహ తలాబ్ స్వర్ణకంకణం ప్రాచీన జానపద కళ వైభవ శిఖరం సర్టిఫికెట్ మూడు ఫీట్లు గల మెమొంటో మెడలో గోల్డ్ మెడల్ సాల్వతో డాక్టర్ జవ్వాజి అంజయ్య గౌడ్ కు ప్రముఖుల చేతుల మీదుగా ఉగాది వైభవసంబరాలలో ఘనంగా సన్మానం చేశారు అలాగే బ్రహ్మశ్రీ డాక్టర్ శ్రీకృష్ణ చాముండేశ్వర మహర్షి మాట్లాడుతూ డాక్టర్ జవ్వాజి అంజయ్య గౌడు ఎన్నో వేదికలెక్కి పాటలు పాడడం ప్రజలను రంజింప చేయడం పల్లె ఆణిముత్యం జాతీయ అంతర్జాతీయ అవార్డులు రికార్డులు తీసుకోవడం ఎన్నో వేదికలికి సన్మానం అందుకోవడం పూర్వజన్మ సుకృతం అన్నారు ఆయనకున్న జ్ఞానోదయం చాలా గొప్పది అని అభివర్ణించారు తెలివి కొందరిది కావచ్చు టాలెంట్ ఎవరు సొత్తు కాదు అలాంటిది టాలెంట్ తో ముందుకెళుతున్న అంజయ్య గౌడు కు నా ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయి అన్నారు ఎన్నో రాష్ట్రాలలో సభా వేదికలెక్కి మధురమైన గానముతో పాటలు పాడడం ఆయనకే దక్కింది అన్నారు పల్లె నుండి ప్రపంచ స్థాయికి ఎదిగిన మట్టి పరిమళాలలో పుట్టిన ఆణిముత్యం అన్నారు డాక్టర్ అంజయ్య గౌడు వారిని జన్మనిచ్చిన తల్లిదండ్రులు జవ్వాజి ఎల్లమ్మ రామయ్య ఇంత మంచి కొడుకును కన్నడం చాలా గొప్పవారు అన్నారు అంజయ్య గౌడు కు వారసత్వం నుంచి వచ్చిందన్నారు వారి తండ్రి నాటకాలు వేశవారన్నారు మోటా లు కొడుతూ రాటులు దింపుతూ రాగాలు తీసేవారు ఆనాడు ఆ రాగాలు తీసే వారికే ఈనాడు అనురాగాల వారసత్వ కుమారుడు ఉండడం నాలుగో సంతానంగా తల్లిదండ్రు పేరు నిలబెట్టడం ఎంతో ఆనందకరమని పొగిడారు వారు ఎంతో నీతి నిజాయితీ గల వారన్నారు వారి ఆశీస్సులే ఎల్లవేళలా ఉండడం వలన ఎన్నో వేదికలు ఎక్కుతున్నారన్నారు వారికి మా గురు ఆశీస్సులు కూడా ఎల్లవేళలా ఉంటాయన్నారు ఆ వేములవాడ రాజరాజేశ్వరి స్వామి ఆశీస్సులు కూడా ఎప్పటికీ ఉంటాయన్నారు ఇంకా మీరు ఎంతో ఎత్తుకు ఎదగాలని ఆశీస్సులు అందజేశారు అలాగే కార్యక్రమాన్ని నిర్వాహకులు మహేంద్రవాడ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ సివి రమణ అకాడమీ ఆధ్వర్యంలో అంజయ్య గౌడ్ గారు మా అవార్డును అందుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు వారు అంజయ్య గౌడ్ కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు మరియు డాక్టర్ జవాజి అంజయ్య గౌడ్ మాట్లాడుతూ నేను గత 1985 నుండి గ్రామం నిజామాబాద్ ప్రాథమిక ఉన్నత పాఠశాల నుండి పురస్కారం అందుకోవడం ఎదుగుతున్న కొద్దీ ఉన్నత పాఠశాల నుండి ఉన్నతంగానే ఎదగడం మాకు పాఠాలు నేర్పిన గురువులు ఆశయాలతో ముందుకెళుతూ నా తల్లిదండ్రి ఆశీస్సులతో జాతీయ అంతర్జాతీయ అవార్డులు రికార్డులు రావడం ఎన్నో వేదికలెక్కి విజయాలు సాధించడం తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా ఎన్నో రాష్ట్రాలలో వేదికలెక్కి ఈరోజు హైదరాబాద్ హరిహర కళాభవన్ లో సార్ సివి రమణ అకాడమీ సేవా సంస్థ ఉగాది సంబరాలలో ప్రాచీన జానపద కళ వైభవ శిఖరం అవార్డు ముఖ్య అతిథులు ప్రముఖుల చేతుల మీదుగా అందుకోవడం నాకు ఎంతో ఆనందంగా ఉందన్నారు సార్ సివి రమణ అకాడమీ సంస్థకు ముఖ్య అతిథులకు కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ డాక్టర్ జవ్వాజి అంజయ్య గౌడ్ ధన్యవాదాలు తెలియజేశారు ముందుగా ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *