పారిశ్రామికవేత్తలకు అండగా ఉంటా : ఎమ్మేల్యే లక్ష్మారెడ్డి

* చర్లపల్లి పారిశ్రామికవాడలో ఎమ్ఎస్ఎమ్ఎ 2026 ఎగ్జిబిషన్ ప్రారంభం

పయనించే సూర్యడు / మార్చ్ 10/ ఉప్పల్ ప్రతినిధి సింగం రాజు పారిశ్రామిక ఉత్పత్తులు విక్రహించుకునేందుకు, ప్రదర్శించేందుకు ఎగ్జిబిషన్లు ఎంతగానో ఉపయోగపడుతాయని ఉప్పల్ నియోజకవర్గం ఎమ్మేల్యే బండారి లక్ష్మారెడ్డి అన్నారు. సోమవారం చర్లపల్లి పారిశ్రామికవాడలోని సిఐఎ అడిటోరియంలో చర్లపల్లి పారిశ్రామికవేత్తల సంఘం అధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎమ్ఎస్ఎమ్ఎ ఎగ్జిబిషన్ 2026ను సిఐఎ అధ్యక్షుడు డిశ్రీనివాసరెడ్డి, టిఫ్ అధ్యక్షుడు కొండవీటి సూధీర్ రెడ్డి, చర్లపల్లి ఐలా అధ్యక్షుడు గోవిందరెడ్డిలతో కలసి ఎమ్మేల్యే ముఖ్య అతిదిగా హజరయ్యారు. ఈసందర్భంగా ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసిన స్టాల్స్ ను ఆయన ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ పరిశ్రమలలో తయారు చేసే వస్తువులను విక్రహించడంతో పాటు ప్రదర్శించేందుకు ఈఎగ్జిబిషన్ ఉపయోగపడుతుందని అన్నారు. ఉప్పల్ నియోజకవర్గంలోని పరిశ్రామికవాడల అభివృద్ధికి తనవంతుగా కృషి చేస్తానని నిత్యం వారికి ఉందుబాటులో ఉండి అండగా ఉంటానని ఎమ్మేల్యే తెలిపారు. పారిశ్రామిక ఉత్పత్తులు ప్రదర్శించేందుకు కన్లేషన్ నిర్మాణం కోసం సిఎంను, మంత్రులను కలసి నిర్మానానికి కృషి చేస్తానని తెలిపారు. ఈఎగ్జిబిషన్ లో పారిశ్రామికవాడలో వినియోగించే అన్ని రకాల వస్తువులను ప్రదర్శించారు. పారిశ్రామిక ఉత్పత్తులతో పాటు బ్యాంకు ల స్టాల్స్ ను ఏర్పాటు చేశారు. ఈకార్యక్రమంలో సిఐఎ కార్యదర్శి మోహన్, చర్లపల్లి ఐలా ఉపాధ్యాక్షులు తాటి శ్రీనివాస్, పారిశ్రామికవేత్తలు కట్టంగూరిహరీష్ రెడ్డి మిరుపాల గోపాల్ రావు,సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి , సిఐఏ కమిటి వైసుధాకర్ రెడ్డి, మల్లిఖార్జున్ రెడ్డి , గంగా ధర్ బాబు , కమిటి సభ్యులు పారిశ్రామికవేత్తలు తదిరతులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *