ప్రజావాణికి 352 దరఖాస్తులుశాఖల వారీగా ప్రజావాణి దరఖాస్తుల సమీక్ష

★ జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా

పయనించే సూర్యుడు మార్చి 10 కరీంనగర్ న్యూస్: ప్రజావాణి దరఖాస్తులకు అత్యంత ప్రాధాన్యత ఇస్తామని, శాఖల వారీగా సమీక్షించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా అన్నారు సోమవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరించారు. దరఖాస్తుల పరిష్కారానికి సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అధికారులు ప్రజావాణి దరఖాస్తులకు ప్రాధాన్యతనిస్తూ వెను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. వారి పరిధిలో లేని దరఖాస్తులను మరో శాఖకు బదిలీ చేయాలని సూచించారు. క్షేత్రస్థాయిలో ప్రతి దరఖాస్తు పై విచారించి సమస్య పరిష్కరించాలని ఆదేశించారు. శాఖల వారీగా దరఖాస్తుల పెండింగ్ అంశాన్ని సమీక్షిస్తానని తెలిపారు. దరఖాస్తులను తమ వద్ద పెండింగ్లో ఉంచవద్దని అన్నారు ప్రజావాణి కార్యక్రమానికి సోమవారం 352 దరఖాస్తులు వచ్చాయి. ప్రజావాణిలో వృద్ధులు, దివ్యాంగులు కూర్చున్న చోటకే వెళ్లి జిల్లా కలెక్టర్ వారి నుండి దరఖాస్తులు స్వీకరించారు ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ లక్ష్మీ కిరణ్, లక్ష్మి కిరణ్, ఆర్డిఓ మహేశ్వర్ తదితరులు పాల్గొన్నారు