ప్రజావాణిలో ఆర్జీలు స్వీకరించిన పీవో యువరాజ్ మర్మట్

పయనించే సూర్యుడు మార్చి 10 ఉట్నూర్ మండలం రిపోర్టర్ షైక్ సోహెల్ పాషా ఉట్నూర్: ఉట్నూర్ లోని ఐటీడీఏ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రాజెక్ట్ అధికారి యువరాజ్ మర్మట్ ప్రజలనుంచి వినతిపత్రాలు స్వీకరించారు ఏజెన్సీ ప్రాంతంలోని వివిధ మండలాల నుంచి వచ్చిన గిరిజనులు ఉద్యోగ, ఉపాధి సహా పలు సమస్యల పరిష్కారం కోరుతూ ఆర్జీలు సమర్పించారు. వారి సమస్యలను సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పరిశీలించి త్వరితగతిన పరిష్కార చర్యలు చేపట్టాలని పీవో ఆదేశించారు ప్రజల సమస్యలపై నిర్లక్ష్యం లేకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆయన సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *