పయనించే సూర్యుడు, మార్చి 10 2026, నాగర్ కర్నూల్ జిల్లా, కల్వకుర్తి ప్రతినిధి నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం వెల్దండ మండల కేంద్రంలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల ప్రణాళికలో భాగంగా 4వ రోజు గ్రామంలో పేరుకు పోయిన ఘన వ్యర్థాల తొలగించడం జరిగింది. సోమవారం వెల్దండ గ్రామపంచాయతీలోని వార్డులలో, పల్లె ప్రకృతి వనం, ఇతర కమ్యూనిటీ ప్రదేశాలలో పారిశుధ్యం చేయడం జరిగింది. గ్రామంలోని ప్రజలకు తడి చెత్త పొడి చెత్త వ్యర్ధాలను వేరువేరుగా చేసి గ్రామ పంచాయతీ చెత్త బండిలో వేయాలని ప్రజలకు తెలియజేశారు. అలాగే ఇంటి పరిసరాలలో శుభ్రంగా ఉంచుకోవడం వల్ల మనకు ఎలాంటి వ్యాధులు, విషజ్వరాలు సోకకుండా ఉంటాయని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి గిరి గౌడ్, ఉప సర్పంచ్ బసనమోనీ శ్రీను, వార్డు సభ్యులు గోసుల కొండయ్య, మసిగుండ్ల వెంకటేష్, బాదేపల్లి రమేష్, శేఖర్, రాఘవరెడ్డి, కాంగ్రెస్ నాయకులు పాలది రంగనాథం, రేవల్లి రాజు, మారేపల్లి శ్రీను, ముదికొండ రమేష్, పురుషోత్తం చారి, గ్రామ నాయకులు కొయ్యల పుల్లయ్య, రెవల్లి రాజు ,చంద్రయ్య, జాషువా, గ్రామ పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.