ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమం విజయవంతం చేయాలి

* హైమద్ నగర్ గ్రామసభ లో మాట్లాడుతున్న సర్పంచ్ షేక్ అలీ

పయనించే సూర్యుడు మార్చి 10 దౌల్తాబాద్ రాజేష్) దౌల్తాబాద్.మార్చి .9 ప్రణాళిక బద్ధంగా గ్రామస్తుల సమిష్టి సహకారంతో గ్రామాన్ని మండలంలోని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుకోవాలని సిద్ధిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం అహ్మద్ నగర్ గ్రామ సర్పంచ్ షేక్ అలీ అన్నారు. గ్రామపంచాయతీ కార్యదర్శి వినోద్. ఉప సర్పంచ్ పాటన్ రోకియా అలీ తో కలిసి గ్రామస్తులతో సోమవారం గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రణాళిక బద్ధంగా గ్రామపంచాయతీని అభివృద్ధి బాటలో తీసుకపోవడానికి గ్రామస్థ సహకారం ఎంతో అవసరం ఉందన్నారు. ముఖ్యంగా పారిశుధ్యంపనులకు పెద్దపిట్ట వేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రజాపాలన. ప్రగతి ప్రణాళిక కార్యక్రమం గ్రామ అభివృద్ధికి ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. గ్రామాల్లో ప్రతి గల్లి గల్లి పరిశుద్ధంగా ఉంచుకోవాలని. మూరికి కాలువల్లో చెత్తాచెదారం వేయకూడదని. ప్రతి వాడను పరిశుభ్రంగా ఉంచుకున్నప్పుడే రోగాలు రావని. గతంలో డెంగ్యూ వ్యాధితో గ్రామస్తులు అనేక బాధలు పడ్డారని గుర్తు చేశారు. మురికి కాలువలు ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకుంటే ఎలాంటి రోగాలు రావని గ్రామస్తులకు సూచించారు. గ్రామంలో ఇంటింటా మంచినీరు సరఫరా చేసే విధంగా పంచాయతీ పాలకవర్గం. అధికారుల సహకారంతో తాగునీటి సమస్య లేకుండా పరిష్కరిస్తామని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన “ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక” కార్యక్రమ ని ఐదు దశల్లో 99 రోజులపాటు “ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక” కార్యక్రమ నిర్వహణ కొనసాగుతుందన్నారు ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం గ్రామ అభివృద్ధికి ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ప్రణాళిక బద్ధంగా అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన ప్రణాళిక బద్ధంగా చేపడితే ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అర్హులైన వారికి అందుతాయని గుర్తు చేశారు. 99 రోజుల్లో ప్రజా పాలన ప్రణాళిక పాలన కొనసాగుతుందని గ్రామంలోని సమస్యల పరిష్కారానికి ఎంతో ఉపయోగపడుతుందన్నారు. గ్రామ ప్రజలు ప్రతి ఒక్కరు ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పేర్కొన్నారు. ఉప సర్పంచ్ … కార్యక్రమంలో గ్రామస్తులు. అంగన్వాడి టీచర్లు. ఆశ వర్కర్లు యువకులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *