పయనించే సూర్యుడు మార్చి 10 రిపోర్టర్ కామని ప్రమోద్ ఖానాపురం మండల కేంద్రం నర్సంపేట నియోజకవర్గం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక నాల్గవ రోజు కార్యక్రమంలో భాగంగా గ్రామంలో పేరుకుపోయిన ఘన వ్యర్ధాల తొలగింపు కార్యక్రమాన్ని స్థానిక ఎస్.ఐ రఘుపతి సర్పంచ్ దాసరి రమేష్ కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా గ్రామంలోని పోలీస్ స్టేషన్ నుండి రైతు వేదిక వరకు అలాగే గ్రామ సరిహద్దుల్లో పేరుకుపోయిన చెత్తచెదారాన్ని తొలగింపు కార్యక్రమాన్ని ముమ్మరంగా చేపట్టారు ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఉప్పు రాజు వార్డు సభ్యులు కందుల రమాదేవి కామిశెట్టి లక్ష్మి గుండ్లపల్లి విజయ్ చలిగంటి మల్లికార్జున్ భూక్య స్రవంతి ఆరిఫా తోటకూరీ సంధ్య గుండ్లపెళ్లి మంజుల సీనియర్ అసిస్టెంట్ పేర్ల రాములు పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు
